త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JEE Results | జేఈఈ ఫ‌లితాలు విడుద‌ల చేసిన ఎన్‌టీఏ.. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి 100 ప‌ర్సంలైట్‌..!

JEE Results | జేఈఈ మెయిన్‌ ఫలితాల‌ను ఎన్‌టీఏ సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఫైన‌ల్ కీని విడుద‌ల చేసిన కొద్ది గంట‌ల్లోనే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. వాస్త‌వానికి జేఈఈ మెయిన్ ఫ‌లితాలు ఈ నెల 12 వ‌ర‌కు విడుద‌ల చేయాల్సి ఉండ‌గా.. ఈ నెల 16లోగా విడుద‌ల చేస్తామంటూ వాయిదా వేసింది.

P

National | Published On Feb 16, 2026, 6.59 pm IST

JEE Results | జేఈఈ ఫ‌లితాలు విడుద‌ల చేసిన ఎన్‌టీఏ.. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి 100 ప‌ర్సంలైట్‌..!
Advertisement

JEE Results | జేఈఈ మెయిన్‌ ఫలితాల‌ను ఎన్‌టీఏ సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఫైన‌ల్ కీని విడుద‌ల చేసిన కొద్ది గంట‌ల్లోనే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. వాస్త‌వానికి జేఈఈ మెయిన్ ఫ‌లితాలు ఈ నెల 12 వ‌ర‌కు విడుద‌ల చేయాల్సి ఉండ‌గా.. ఈ నెల 16లోగా విడుద‌ల చేస్తామంటూ వాయిదా వేసింది. అభ్య‌ర్థులు ఫ‌లితాల‌ను jeemain.nta.nic.in, ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ nta.ac.inల‌లో చెక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అప్లికేషన్‌ నంబర్‌, డేట్ ఆఫ్ బ‌ర్త్ వివరాలు ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం జ‌న‌వ‌రి 21 నుంచి 29 వ‌ర‌కు జేఈఈ మెయిన్ తొలి విడ‌త (పేపర్‌-1, పేపర్-2) పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విష‌యం తెలిసిందే. పేప‌ర్‌-1 (బీఈ-బీటెక్‌) కోసం దేశ‌వ్యాప్తంగా 13.55ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 95శాతం మంది హాజ‌ర‌య్యారు. ఈ నెల 4న ఎన్‌టీఏ ప్రొవిజిన‌ల్ కీని విడుద‌ల చేసింది. 6వ తేదీ వ‌ర‌కు అభ్యంత‌రాల‌ను స్వీక‌రించింది. తాజాగా సోమ‌వారం ఉద‌యం ఫైన‌ల్ కీని విడుద‌ల చేసిన కొద్ది గంట‌ల్లోనే ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది.

దేశ‌వ్యాప్తంగా ఈ సారి 12 మంది విద్యార్థులు 100 ప‌ర్సంటైల్ సాధించారు. ఇందులో తెలంగాణ‌, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి ఇద్ద‌రు, తెలంగాణ నుంచి ఒక్క‌రు వంద ప‌ర్సంటైల్ సాధించారు. రాజ‌స్థాన్ నుంచి ముగ్గురు, ఢిల్లీ, బిహార్, ఒడిశా, హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల నుంచి ఒక్క‌రు 100 ప‌ర్సంటైల్ సాధించిన‌ట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఓబీసీ కేట‌గిరిలో ఏపీకి చెందిన జీ న‌రేంద్ర బాబు, ఎస్సీ కేట‌గిరిలో ప‌స‌ల మోహిత్ (ఏపీ) మొద‌టి ర్యాంకులు సాధించారు. తెలంగాణ‌కు చెందిన వివ‌న్ శ‌ర‌త్ మ‌హీశ్వ‌రి వంద ప‌ర్సంలైట్ సాధించారు. ఈ సారి మొత్తం 13,04,653 మంది ప‌రీక్ష రాయ‌గా.. మెయిన్ ఫ‌లితాల‌తో పాటు ఆలిండియా ర్యాంక్ లిస్ట్‌, రాష్ట్రాల వారీగా టాపర్ల జాబితాను కూడా ఎన్టీఏ విడుద‌ల చేసింది.

Advertisement
Advertisement