IISC | ఐఐఎస్‌సీలో బీటెక్ అడ్మిషన్లు.. ఇకపై జోసా కౌన్సెలింగ్ ద్వారానే
IISC | దేశంలో అగ్రశ్రేణి యూనివర్సిటీగా వెలుగొందుతున్న, సైన్స్ కోర్సులకు నెలవైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC)లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ సులభం కానున్నది. బెంగళూరులో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఇక నుంచి బీటెక్ సీట్లను (BTech admissions) జాయింట్ సీట్ ఎలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.
త్రినేత్ర.న్యూస్: దేశంలో అగ్రశ్రేణి యూనివర్సిటీగా వెలుగొందుతున్న, సైన్స్ కోర్సులకు నెలవైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC)లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ సులభం కానున్నది. బెంగళూరులో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఇక నుంచి బీటెక్ సీట్లను (BTech admissions) జాయింట్ సీట్ ఎలకేషన్ అథారిటీ (JOSAA) కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటీ రూర్కీ వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) బీటెక్ సీట్లను జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొంది.
ఇప్పటివరకు ఐఐఎస్‌సీలో (Indian Institute of Science) బీటెక్ సీట్లను ఐఐఎస్‌సీ లేదా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, కేవీపీవై, నీట్ వంటి జాతీయ స్థాయిలో సాధించే ర్యాంకుల ద్వారానే విద్యార్థులకు కేటాయించేవారు. అయితే దీనికోసం సంస్థ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేది. అయితే దీనిపై అవగాహన లేని చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం లేదు. దీంతో మెరిట్ విద్యార్థులు కూడా ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో అభ్యసించే అవకాశం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జోసా కౌన్సెలింగ్ ద్వారానే బీటెక్ సీట్లను భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది.
సెన్స్‌కోర్సులకు పేరొందిన ఐఐఎస్‌సీలో బీటెక్ ఇన్ మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సు మాత్రమే ఉంది. అందులో 52 సీట్లు ఉండగా, అందులో ఎనిమిది సీట్లను అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. మరో నాలుగింటిని విదేశీ విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు. అయితే జోసాలో చేరడంతో బీటెక్ కోర్సులు కూడా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





