త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ishan Tharoor | 300 మందిని తొల‌గించిన వాషింగ్ట‌న్ పోస్ట్‌.. ఉద్యోగం కోల్పోయిన శ‌శిథ‌రూర్ కుమారుడు

Ishan Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత‌, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) కుమారుడు ఉద్యోగం కోల్పోయారు.

D

National | Published On Feb 5, 2026, 11.34 am IST

Ishan Tharoor | 300 మందిని తొల‌గించిన వాషింగ్ట‌న్ పోస్ట్‌.. ఉద్యోగం కోల్పోయిన శ‌శిథ‌రూర్ కుమారుడు
Advertisement

Ishan Tharoor | టెక్‌ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏఐ రాక‌తో ఐటీ ఉద్యోగుల‌ కొలువులు ప్రమాదంలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే వేలాది మంది త‌మ ఉద్యోగాల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత‌, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) కుమారుడు కూడా ఉద్యోగం కోల్పోయారు.

ప్ర‌ముఖ వార్తా ప‌త్రిక వాషింగ్ట‌న్ పోస్ట్ (Washington Post) ఉద్యోగుల‌కు లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. ఖ‌ర్చుల‌ను తగ్గించుకునేందుకు చేప‌ట్టిన పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా బుధవారం రోజు ఏకంగా మూడింట ఒక వంతు సిబ్బంది అంటే 300పై వేటు వేసింది. ఈ లేఆఫ్స్ ప్ర‌భావం ప‌లు విభాగాల‌పై తీవ్రంగా ప‌డింది. ఇక లేఆఫ్స్‌కు గురైన వారిలో శ‌శి థ‌రూర్ కుమారుడు ఇషాన్ థ‌రూర్ (Ishan Tharoor) కూడా ఉన్నారు. ప‌త్రిక‌లో ఇషాన్ సీనియ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ అఫైర్స్ కాల‌మిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. సంస్థ నిర్ణ‌యంతో ఆయ‌న త‌న ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది.

ఇక ఈ లేఆఫ్స్ పై ఇషాన్ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. "నా గుండె పగిలిపోయింది" అంటూ ట్వీట్ చేశారు. 12 ఏళ్లుగా ఈ ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. ఎంతో అద్భుత‌మైన‌, అనుభ‌వ‌జ్ఞులైన వ్య‌క్తుల‌తో ప‌నిచేసిన‌ట్లు చెప్పారు. వారంద‌రితో ప‌నిచేయ‌డంతో గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. తాజా లేఆఫ్స్‌తో త‌న‌తోపాటూ అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాలు చూసే అత్యంత ప్రతిభావంతులైన జర్నలిస్టులు, తన స్నేహితులు, సహోద్యోగులు కూడా కొలువును కోల్పోయార‌ని తెలిపారు. ఈ లేఆఫ్స్ త‌న‌ను తీవ్రంగా బాధిస్తున్న‌ట్లు త‌న పోస్ట్‌లో ఇషాన్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను శ‌శి థ‌రూర్ కూడా రీపోస్ట్ చేశారు. బ్యాడ్ డే అంటూ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

https://x.com/ishaantharoor/status/2019085243228053795

Advertisement
Advertisement