త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rs 500 Notes | రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేయ‌నున్నారా..? డీమానెటైజేష‌న్ 2.0 రానుందా..?

Rs 500 Notes | దేశంలో మరోసారి నోట్ల రద్దు (డీమానెటైజేషన్ 2.0) జరుగుతుందా? ముఖ్యంగా రూ.500 నోట్లను చెలామ‌ణీ నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉన్నాయా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

S

National | Published On Jan 20, 2026, 10.58 am IST

Rs 500 Notes | రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేయ‌నున్నారా..? డీమానెటైజేష‌న్ 2.0 రానుందా..?
Advertisement

Rs 500 Notes | దేశంలో మరోసారి నోట్ల రద్దు (డీమానెటైజేషన్ 2.0) జరుగుతుందా? ముఖ్యంగా రూ.500 నోట్లను చెలామ‌ణీ నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉన్నాయా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద నోట్ల రద్దు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న పోస్టుల‌ కారణంగా ఈ భయాలు మరింత పెరిగాయి. ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి రూ.500 నోట్లను పరిమితం చేయాలని లేదా పూర్తిగా ఉపసంహరించాలనే ఆలోచనలో ఉన్నాయని కొన్ని పోస్టులు పేర్కొంటున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో రూ.100 నోటే దేశంలో అతి పెద్ద కరెన్సీ నోటుగా మిగిలిపోతుందని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

PIB ఖండ‌న‌..

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మీడియా విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) రంగంలోకి దిగింది. రూ.500 నోట్లను నిషేధించబోతున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నకిలీ వార్త‌లుగా పేర్కొంటూ, వాటిపై ఎరుపు రంగులో FAKE అనే ముద్రతో కూడిన గ్రాఫిక్‌ను కూడా క్రియేట్ చేసింది. జనవరి 18న PIB విడుదల చేసిన ప్రకటనలో, భారత ప్రభుత్వం రూ.500 నోట్లను నిషేధించబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అని స్పష్టం చేసింది. నల్లధనం నిర్మూలన కోసం రూ.500 నోట్లను రద్దు చేయనున్నారని కొందరు చేస్తున్న ప్రచారాన్ని కూడా PIB ఖండించింది.

అధికారిక ప్ర‌క‌ట‌న‌లు చూడాలి..

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన PIB ఫ్యాక్ట్ చెక్ బృందం, ఆర్థిక విధానాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు అధికారిక వనరులపైనే ఆధారపడాలని సూచించింది. రూ.500 నోట్లను నిషేధించనున్నట్లు వస్తున్న వార్తలు అసత్యం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు.. అని పేర్కొంది. ప్రస్తుతం రూ.500 నోట్లు యథావిధిగా చెలామ‌ణీలో కొనసాగుతాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనల‌కు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదివరకు కూడా ఇలాంటి తప్పుడు వార్తలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు PIB గుర్తు చేసింది. అందుకే ప్రతి ఒక్కరూ వార్తలను నమ్మేముందు అధికారిక ప్రకటనలు, విశ్వసనీయ వనరులను పరిశీలించాలని సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement