Money Saving | ఇకపై బ్యాంక్ బ్యాలెన్స్, పెట్టుబడులు, బీమా వివరాలు.. అన్నింటినీ ఒకే వేదికపై ట్రాక్ చేయవచ్చు..
Money Saving | ప్రతి నెల బ్యాంక్ బ్యాలెన్స్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, ప్రావిడెంట్ ఫండ్, బీమా పాలసీలు ఇలా వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్లు ఓపెన్ చేసి చూసే అవసరం ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌లో మీ మొత్తం ఆర్థిక స్థితిగతులు కనిపించే విధానాన్ని అమలు చేయడానికి దేశ ఆర్థిక నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.
Money Saving | ప్రతి నెల బ్యాంక్ బ్యాలెన్స్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, ప్రావిడెంట్ ఫండ్, బీమా పాలసీలు ఇలా వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్లు ఓపెన్ చేసి చూసే అవసరం ఇక తగ్గే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌లో మీ మొత్తం ఆర్థిక స్థితిగతులు కనిపించే విధానాన్ని అమలు చేయడానికి దేశ ఆర్థిక నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రజలు తమ బ్యాంక్ ఖాతాల వివరాల కోసం బ్యాంక్ యాప్‌లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల కోసం వేరు ప్లాట్‌ఫామ్‌లు, బీమా వివరాల కోసం మరో పోర్టల్, పీఎఫ్ కోసం మరో వెబ్‌సైట్ ఇలా అనేక చోట్ల లాగిన్ అవ్వాల్సి వస్తోంది. ప్రతి సంస్థ వేర్వేరుగా నెల నెలా రిపోర్టులు లేదా స్టేట్‌మెంట్లు పంపడం వల్ల మొత్తం ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, వ్యక్తి మొత్తం పొదుపు, పెట్టుబడులపై ఒకే నెలవారీ సమగ్ర స్టేట్‌మెంట్ ఇవ్వాలన్నదే ఈ ప్రతిపాదిత విధానం లక్ష్యం.
ముందుకొచ్చిన సెబీ..
ఈ కార్యక్రమానికి ప్రధానంగా ముందుకొచ్చింది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI). ఈ వ్యవస్థను అమలు చేయడానికి సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)లతో కలిసి పనిచేస్తోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగాలన్నిటినీ ఒకే రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్, మ్యుచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్ (CAS) అనే నివేదిక నెలకు ఒకసారి అందుతోంది. ఇందులో డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల వివరాలే ఉంటాయి. అయితే దీని పరిధి చాలా పరిమితంగా ఉంది. ఇప్పుడు ఈ CASను మరింత విస్తరించి, వ్యక్తి పూర్తి ఆర్థిక చిత్రాన్ని చూపించేలా మార్చాలని నియంత్రణ సంస్థలు భావిస్తున్నాయి. ఈ కొత్త విధానంలో బ్యాంక్ ఖాతాల బ్యాలెన్స్‌లు, చిన్న పొదుపు పథకాల వివరాలు, బీమా పాలసీలు, బాండ్ పెట్టుబడులు, ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాల సమాచారం కూడా ఒకే స్టేట్‌మెంట్‌లో ఉంటుంది. దీని వల్ల ప్రజలకు తమ డబ్బు ఏయే ప్లాట్‌ఫామ్‌లో ఎంత మొత్తంలో ఉంది అన్న వివరాలు ఒకే స్టేట్‌మెంట్ ద్వారా తెలుస్తాయి.
అన్నీ ఒకే వేదికపై ట్రాకింగ్..
ఈ విధానం అమల్లోకి వస్తే, ప్రజలు తమ పొదుపులు, పెట్టుబడులు అన్నిటింనీ ఒకే చోట చూసుకునే అవకాశం ఉంటుంది. అనేక యాప్‌లు, స్టేట్‌మెంట్‌లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను మరింత సమర్థవంతంగా రూపొందించుకోవచ్చు. బ్యాంకింగ్, బీమా, పెన్షన్, మార్కెట్ పెట్టుబడులను ఒకే సమగ్ర వేదికపై చూపించడం ద్వారా కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సౌలభ్యం పెరుగుతుందని నియంత్రణ సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఇది ఒక కీలకమైన మార్పుగా నిలవనుంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు ఈ విధానంపై త్వరలోనే ఒక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



