త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sheikh Nahyan | ఢిల్లీకి యూఏఈ అధ్య‌క్షుడు న‌హ్యాన్‌.. రెండుగంట‌ల్లోనే ముగిసిన ప‌ర్య‌ట‌న‌..!

Sheikh Nahyan | యూఏఈ అధ్య‌క్షుడు షేక్ మొహ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ సోమ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ఆయ‌న‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత క‌ల్యాణ్ మార్గ్‌లోని త‌న నివాసంలో మోదీ అల్ న‌హ్యాన్‌తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు.

P

National | Published On Jan 19, 2026, 10.30 pm IST

Sheikh Nahyan | ఢిల్లీకి యూఏఈ అధ్య‌క్షుడు న‌హ్యాన్‌.. రెండుగంట‌ల్లోనే ముగిసిన ప‌ర్య‌ట‌న‌..!
Advertisement

Sheikh Nahyan | యూఏఈ అధ్య‌క్షుడు షేక్ మొహ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ సోమ‌వారం ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ఆయ‌న‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత క‌ల్యాణ్ మార్గ్‌లోని త‌న నివాసంలో మోదీ అల్ న‌హ్యాన్‌తో ద్వైపాక్షిక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రెండుదేశాల మ‌ధ్య ప‌లు అవ‌గాహ‌న ఒప్పందాలు జ‌రిగాయి. వివిధ రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపారు. లోటల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌కు చారిత్రక కళాఖండాలను అందించేందుకు యూఏఈ తీసుకున్న చొర‌వ‌ను ప్రధాన మంత్రి మోదీ ప్రశంసించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అన్నారు. పోలార్ సైన్స్‌, సంస్థాగ‌త స‌హ‌కారం త‌దిత‌ర రంగాల్లోనూ క‌లిసి ప‌ని చేసేందుకు ఇద్ద‌రు నేత‌లు అంగీక‌రించారు. భారత సంతతికి చెందిన సుమారు 4.5 మిలియన్ల మంది ప్రజలు యూఏఈలో నివాసం ఉంటూ ఉపాధి పొందుతున్నార‌ని విక్ర‌మ్ మిస్రి తెలిపారు.

భారతీయ పౌరుల శ్రేయస్సు, ప్రయోజనాలను కాపాడుతున్నందుకు అధ్యక్షుడు షేక్ మొహమ్మద్‌కు ప్ర‌ధాని కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌న్నారు. పశ్చిమాసియాలోని ప్రాంతీయ సమస్యలను వివరంగా చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, భ‌ద్ర‌త, శ్రేయ‌స్సు కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వాణిజ్యం, పెట్టుబ‌డిరంగాల్లో అనేక కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసేందుకు ఒప్పందాలు కుదిరాయ‌ని మిస్రి తెలిపారు. భారత్ మార్ట్, వర్చువల్ ట్రేడ్ కారిడార్, ఇండియా-ఆఫ్రికా సేతు, యూఏఈ కంపెనీలు డీపీ వరల్డ్, ఫస్ట్ అబుదాబి బ్యాంక్ గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తమ కార్యాలయాలు, కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమ‌తి ఇచ్చారు. వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి రెండు దేశాలు నిర్ణయించాయని ఆయ‌న తెలిపారు.

గత దశాబ్దంలో భారతదేశం-యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం క్ర‌మంగా బ‌ల‌ప‌డుతున్న‌ట్లుగా ఇద్ద‌రు నేత‌లు పేర్కొన్నారు. ఇటీవ‌ల సంవ‌త్స‌రాల్లో ఆయా దేశాల్లో నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు పెర‌గ‌డాన్ని స్వాగ‌తించారు. రెండేళ్ల‌లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార‌త్‌ను సంద‌ర్శించారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఇద్ద‌రు నేత‌లు ఆకాంక్షించారు. అబుదాబిలో హౌస్ ఆఫ్ ఇండియాను స్థాపించాలని నిర్ణయించినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తర్వాత వాణిజ్య రంగంలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లు దాటిందన్నారు. 2032 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇద్దరు నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. యూఏఈ అధ్య‌క్షుడు కేవ‌లం రెండుగంట‌ల పాటు మాత్ర‌మే ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగింది.

Advertisement

తాజావార్తలు

Advertisement