PM Modi | ఇంటర్నెట్ చాలా చౌక ధరకే లభిస్తోంది.. టైమ్‌వేస్ట్ చేసుకోకండి.. విద్యార్థులకు ప్రధాని సూచన
PM Modi | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
PM Modi | విద్యార్థు (Students)ల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా 9వ ఎడిషన్ పరీక్షా పే (Pariksha Pe Charcha 2026) చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. పరీక్షల్లో ఒత్తిడి సహా అనేక సమస్యలపై వారితో సంభాషించారు. అదే సమయంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానాలిచ్చారు. పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని వారికి సూచించారు. అంతేకాదు, బెట్టింగ్‌తో కూడిన ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల వాడకంపై కూడా విద్యార్థులను హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
ఎన్నో సలహాలు ఇస్తుంటారు..
ఈ సందర్భంగా తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. “నేను ప్రధానిని అయ్యాను. పనితీరు గురించి ప్రజలు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అన్నింటినీ వినాలి. అందులో మనకు సరిపోయేదే ఎంచుకోవాలి. నేను కూడా కొన్ని సూచనలు తీసుకుని మార్పులు చేసుకున్నాను. అయితే, నా విలువలను మాత్రం వదులుకోలేదు” అని స్పష్టం చేశారు.
జూదం, బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దు..
పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య అంశాలపై కూడా మోదీ వారికి కీలక సూచనలు చేశారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలు అన్నింటికీ సరైన బ్యాలెన్స్ ఉండాలని సూచించారు. అదే మన ఎదుగుదలకు కీలకమన్నారు. ఆటలు ఆడటం కూడా ఒక నైపుణ్యమని.. వాటిని సరదాగా మాత్రం చూడొద్దని ప్రధాని సూచించారు. జూదం, బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. బెట్టింగ్‌లపై దేశంలో చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు.
టైమ్ వేస్ట్ చేసుకోకండి..
ప్రస్తుతం మన దేశంలో ఇంటర్నెట్ చాలా చౌక ధరలకే లభిస్తోందని ప్రధాని తెలిపారు. సమయాన్ని వృథా చేసుకోకూడదని సూచించారు. గతం దగ్గరే ఆగిపోకుండా.. ముందున్న లక్ష్యాలవైపు వెళ్లేందుకు ప్రయత్నించాలని సూచించారు. పరీక్షలను భయంగా కాకుండా పండుగలా మార్చుకోవాలన్నారు. ఇతరులతో కాకుండా.. మీతో మీరు పోటీ పడాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






