త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arrive-Alive | మాదాపూర్ పీఎస్ పరిధిలో అరైవ్ – అలైవ్ కార్య‌క్ర‌మం

Arrive-Alive | మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధ‌వారం అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు.

P

Hyderabad | Published On Jan 21, 2026, 9.01 pm IST

Arrive-Alive | మాదాపూర్ పీఎస్ పరిధిలో అరైవ్ – అలైవ్ కార్య‌క్ర‌మం
Advertisement

Arrive-Alive | మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధ‌వారం అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ప్ర‌యాణీకులు త‌ప్ప‌నిస‌రిగా నిబంధ‌న‌లు పాటించాల్సిన రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌మాదాల‌ను అరిక‌ట్టాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. అంద‌రూ ట్రాఫిక్ నియ‌మాల‌ను తూ.చా త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించారు. రోడ్డు ప్ర‌మాదాల‌తో అనేక కుటుంబాలు న‌ష్ట‌పోతున్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

ప్రతీఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వాహనాలు న‌డిపే స‌మ‌యంలో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు.సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం, మద్యం సేవించి, రాంగ్‌రూట్‌లో వాహ‌నాలు న‌డ‌ప‌డం, సిగ్నల్ జంపింగ్ వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ద్విచ‌క్ర వాహ‌నాలు న‌డిపే స‌మ‌యంలో హెల్మెట్లు పెట్టుకోవాల‌ని.. కొంద‌రు హెల్మెట్లు ధ‌రించిన స‌రిగ్గా బెల్టులు ధ‌రించ‌డం లేద‌ని, దాంతో ప్రాణాలు పోతున్నాయ‌న్నారు. కార్య‌క్ర‌మంలో మాదాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్ కృష్ణ మోహన్, మాదాపూర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ నాయక్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement