త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Youth Congress president | ఏఐ స‌మ్మిట్‌లో అర్ధ‌న‌గ్న నిర‌స‌న‌.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్‌

Youth Congress president | ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 (India AI Impact Summit 2026)లో ష‌ర్ట్ విప్పి నిర‌స‌న వ్య‌క్తం చేసిన కేసులో.. ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ (Indian Youth Congress president) ఉద‌య్ భాను చిబ్‌ (Uday Bhanu Chib)ను పోలీసులు అరెస్టు చేశారు.

D

National | Published On Feb 24, 2026, 11.37 am IST

Youth Congress president | ఏఐ స‌మ్మిట్‌లో అర్ధ‌న‌గ్న నిర‌స‌న‌.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్‌
Advertisement

Youth Congress president | ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 (India AI Impact Summit 2026)లో యూత్ కాంగ్రెస్ (Youth Congress) నిర‌స‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ష‌ర్ట్ విప్పి (shirtless protests) స‌ద‌స్సు స్టేజి వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టికే ఏడుగురిని అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ (Indian Youth Congress president) ఉద‌య్ భాను చిబ్‌ (Uday Bhanu Chib)ను అదుపులోకి తీసుకున్నారు. క‌స్ట‌డీలోకి తీసుకోవ‌డానికి ముందు ఆయ‌న్ను సుమారు 15 గంట‌లకుపైగానే పోలీసులు ప్ర‌శ్నించారు. అనంత‌రం ఇవాళ తెల్ల‌వారుజామున అదుపులోకి తీసుకున్నారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన ఆ వేదికపై చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం వెనుక ఉదయ్ భాను కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇండియా-యూఎస్ మ‌ధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌కు (India-US Trade Deal) నిర‌స‌న‌గా యూత్ కాంగ్రెస్ నేత‌లు గ‌త శుక్ర‌వారం భార‌త్ మండ‌పంలో జ‌రుగుతున్న ఏఐ స‌మ్మిట్‌లో ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. చొక్కాలు విప్పి వేదిక వ‌ద్ద నిర‌స‌న (Protest) తెలిపారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళ‌న‌ల‌తో ప్ర‌పంచ నాయ‌కులు, అగ్ర‌శ్రేణి సీఈవోలు పాల్గొన్న స‌మ్మిట్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో నిర్వాహ‌కులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు కొంద‌రు నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రం దేశ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. నిర‌స‌న‌లు తెలిపిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement