Indian teacher | ప్రపంచ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన భారతీయ టీచర్.. ఎవరీ రూబెల్ నాగి..?
Indian teacher | భారతదేశానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలి (Indian teacher)కి ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది.
Indian teacher | భారతదేశానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలి (Indian teacher)కి ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది. ముంబైకి చెందిన ఆర్ట్, సోషల్ సైన్స్ టీచర్ రూబెల్ నాగి (Rouble Nagi) ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్-2026ను (Global Teacher Prize) గెలుచుకున్నారు. గురువారం దుబాయ్ (Dubai)లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ పురస్కారం కింద ఆమెకు భారీ ప్రైజ్ మనీ కూడా దక్కింది. వర్కీ ఫౌండేషన్ రూబెల్‌కు 10 లక్షల డాలర్లను బహుమతిగా అందించింది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.9 కోట్లన్నమాట. అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకుని ప్రపంచ వేదికపై మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రూబెల్ నాగిపై సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆమె గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
మురికివాడల్లోని పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పుతూ..
ముంబైకి చెందిన రూబెల్ నాగి.. ఇండియాలోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు విద్యను చేరువ చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. తన మిసాల్ ఇండియా, రూబెల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా దేశంలో వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800కిపైగా లెర్నింగ్ సెంటర్‌లను స్థాపించారు. వాటి ద్వారా 600 మంది వాలంటీర్లు, ఉపాధ్యాయుల సాయంతో స్కూల్ చదువుకు దూరంగా ఉన్న ఎందరో చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పుతున్నారు.
మురికివాడ గోడల్ని తరగతి దగుల్లా మార్చి..
మరో విశేషం ఏంటంటే.. మురికివాడ గోడలను ఆమె తరగతి దగుల్లా మార్చేశారు. గోడల మీద వివిధ సబ్జెక్టులకు సంబంధించిన చిత్రాలు గీసి వాటినే పాఠ్య పుస్తకాలుగా మార్చేస్తున్నారు. చదువుతో పాటు జీవన నైపుణ్యాలు, వృత్తి విద్య, సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.
ఫ్రీగా శిక్షణా కేంద్రం..
ఇక ఈ పురస్కారంపై రూబెల్ స్పందించారు. ఈ అవార్డు తనతోపాటూ భారత్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రైజ్ మనీతో విద్యార్థులకు ఫ్రీగా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఈ అవార్డు తనను మరింత ముందుకు వెళ్లేందుకు ప్రేరణనిస్తుందన్నారు. ప్రతీ విద్యార్థి విద్యను పొందేలా చూసేందుకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






