త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Embassy Advisory | రియాద్‌కు విమాన సర్వీసులు బంద్‌.. భారతీయులకు ఎంబ‌సీ అడ్వైజ‌రీ

Indian Embassy Advisory | రియాద్‌లో వైమానిక దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని భారతీయుల భద్రతపై భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, వైమానిక దాడులు జరిగినప్పుడు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.

P

National | Published On Oct 14, 2026, 8.57 pm IST

Indian Embassy Advisory | రియాద్‌కు విమాన సర్వీసులు బంద్‌.. భారతీయులకు ఎంబ‌సీ అడ్వైజ‌రీ
Advertisement

Indian Embassy Advisory | రియాద్‌లో వైమానిక దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని భారతీయుల భద్రతపై భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, వైమానిక దాడులు జరిగినప్పుడు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఘటనలకు సంబంధించిన వీడియోలు, వార్తలను సోషల్‌ మీడియాలో ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది. మరోవైపు రియాద్‌లోని కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. సౌదీలోని దమ్మామ్‌, జెడ్డా, మదీనా విమానాశ్రయాల నుంచి సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని అంతరాయాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 10న రియాద్‌ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన భారతీయులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇద్దరు ఐసీయూలో ఉండగా.. మరొకరిని ఐసీయూ నుంచి హై డిపెండెన్సీ యూనిట్‌ (హెచ్‌డీయూ)కు తరలించారు. మరో నలుగురు జనరల్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

అక్టోబర్‌ 17 వరకు సర్వీసుల నిలిపివేత

భారతీయ విమానయాన సంస్థలు సౌదీ అరేబియాకు నడిపే విమాన సర్వీసులను అక్టోబర్ 17 వరకు నిలిపివేసినట్లు ఎంబసీ వెల్లడించింది. అయితే కొన్ని విమానాలు షెడ్యూల్‌ ప్రకారం నడుస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌, ఇండిగో విమానాలు అక్టోబర్‌ 17 వరకు సర్వీసులు నిలిపివేయ‌నున్న‌ట్లు తెలిపింది. అలాగే, సౌదియా ఎయిర్‌లైన్స్ విమానాలు దమ్మామ్‌, జెడ్డా, మదీనా నుంచి షెడ్యూల్‌ ప్రకారం విమానాలు ఉంటాయ‌ని తెలిపింది. ఫ్లైనాస్ విమానాలు దమ్మామ్‌–లక్నో మధ్య షెడ్యూల్‌ ప్రకారం స‌ర్వీసులు ఉంటాయ‌ని.. రియాద్‌ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు నిలిపివేసిన‌ట్లు చెప్పింది. దమ్మామ్‌, జెడ్డా, మదీనా విమానాశ్రయాల నుంచి కొన్ని అంతరాయాలతో సర్వీసులు కొన‌సాగుతున్న‌ట్లుగా పేర్కొంది. రియాద్‌ విమానాశ్రయంలో సర్వీసుల పునరుద్ధరణపై ఎంబసీ నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. సౌదీ అరేబియా నుంచి భారత్‌కు, భారత్‌ నుంచి సౌదీకి ప్రయాణించేవారు విమానాల తాజా స్టేట‌స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించింది. స్థానిక అధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు విజ్ఞప్తి చేసింది.

Advertisement
Advertisement