త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Honey Singh | హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసుల సమన్లు

Honey Singh | ప్రముఖ ర్యాపర్‌, గాయకుడు యో యో హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణకు రెండు రోజుల్లో హాజరుకావాలని ఆదేశించారు.

P

Entertainment | Published On Oct 14, 2026, 8.45 pm IST

Honey Singh | హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసుల సమన్లు
Advertisement

Honey Singh | ప్రముఖ ర్యాపర్‌, గాయకుడు యో యో హనీ సింగ్‌కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణకు రెండు రోజుల్లో హాజరుకావాలని ఆదేశించారు. ఈసారి కూడా విచారణకు హాజరుకాకపోతే ఆయనపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశముందని అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ హనీ సింగ్‌ విచారణకు హాజరుకాలేదని మహారాష్ట్ర సైబర్‌ వర్గాలు వెల్లడించాయి. విదేశాల్లో ఉండ‌డంతో హాజరుకాలేకపోయినట్లు సమాచారం. అక్టోబర్‌ 5న విచారణకు రావాల్సి ఉన్నా ఆయన హాజరుకాలేదు. మరింత సమయం కావాలని అధికారులను కోరారు. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు. ఓ మ్యూజిక్ క‌న్స‌ర్ట్ సందర్భంగా హనీ సింగ్‌ చేసినట్లు ఆరోపిస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలే ఈ కేసుకు కారణం. ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు హనీ సింగ్‌ను విచారించాలని నిర్ణయించారు. విచార‌ణ త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement