Medical Staff | ఖమ్మం DMHOలో 99 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
Medical Staff | మెడికల్, పారా మెడికల్ ఉద్యోగార్థులకు శుభువార్త. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖమ్మం జిల్లా పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్, పారామెడికల్, ఇతర సిబ్బంది (Medical Staff) భర్తీకి వైద్యారోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Medical Staff | త్రినేత్ర న్యూస్: మెడికల్, పారా మెడికల్ ఉద్యోగార్థులకు శుభువార్త. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖమ్మం (Khammam) జిల్లా పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్, పారామెడికల్, ఇతర సిబ్బంది (Medical Staff) భర్తీకి వైద్యారోగ్యశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మొత్తం 99 ఖాళీలకు జిల్లా వైద్యాధికారి కార్యాలయం (DMHO) నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారు. అర్హులైన వారు నేరుగా కానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 13తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ప్రతినెల రూ.22,750 నుంచి రూ.1,00,000 (పోస్టును భట్టి) జీతం అందుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ఓబీజీ స్పెషలిస్ట్- 1 (రూ.1,00,000)
అనస్థీటిస్ట్- 1 (రూ.1,00,000)
యూరాలజిస్ట్- 1 (రూ.1,00,000)
పాథాలజిస్ట్- 1 (రూ.1,00,000)
పీడియాట్రీషియన్- 2 (రూ.1,00,000)
ఫిజీషియన్స్- 2 (రూ.52,000 నుంచి రూ.72,850)
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 1 (రూ.52,000)
పల్లె దవాఖాన - MLHP/CHO/MO- 36 (రూ.40,000)
సీనియర్ డాట్స్ ప్లస్ టీబీ హెచ్‌ఐవీ సూపర్‌వైజర్- 1 (రూ.33,750)
స్టాఫ్ నర్స్, నర్సింగ్ ఆఫీసర్స్- 24 (రూ.29,900)
ఏఎన్‌ఎం, 2వ ఏఎన్‌ఎం- 11 (రూ.27,300)
ల్యాబ్ టెక్నీషియన్- 14 (రూ.27,300)
ఫార్మాసిస్ట్- 3 (రూ.27,300)
సైకాలజిస్ట్- 1 (రూ.22,750)
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు 2026, జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏండ్లు, దివ్యాంగులు 10, మాజీ సైనికోద్యోగులు 3, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేసిన వారికి 3 ఏండ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: కేవలం మెరిట్ ప్రాతిపదికన 100 మార్కులకు లెక్కిస్తారు. అభ్యర్థులు సాధించిన అర్హత పరీక్ష మార్కులకు 90 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. మిగిలిన 10 మార్కులను అభ్యర్థి వయస్సు ఆధారంగా (18 ఏండ్లు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున గరిష్టంగా 10 మార్కులు) ఇస్తారు. నిబంధనల ప్రకారం రోస్టర్ విధానం, స్థానికత, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో (స్వయంగా, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా). జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://khammam.telangana.gov.in నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, దానిని పూర్తిగా నింపి.. అవసరమైన సర్టిఫికెట్లను, నిర్ణీత ఫీజు డీడీని జతచేసి పంపించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను District Medical & Health Officer, Khammam పేరుతో ఖమ్మంలో చెల్లించేలా తీయాల్సి ఉంటుంది.
అడ్రస్: District Medical & Health Office, F1, I.D.O.C, V. వెంకటయ్యపాలెం, ఖమ్మం.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 13, సాయంత్రం 5 గంటలలోపు
వెబ్‌సైట్: https://khammam.telangana.gov.in
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం
అక్టోబర్ 10, 2026

Tummala Nageswara Rao | ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
అక్టోబర్ 10, 2026

HAL Junior Executive | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●సిక్స్‌ప్యాక్ కోసం నీళ్లకు బ్రేక్!.. స్క్రీన్‌పై లుక్ కోసం శరీరానికి షాక్!
- ●Horoscope | అక్టోబర్ 11 రాశిఫలాలు.. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
- ●City Crime | మైనర్ బాలిక అక్రమ రవాణా కేసులో 8 మంది అరెస్ట్.. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
- ●Mogambo Modi | మొగాంబో మోదీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు
- ●Navaratri Brahmotsavam 2026 | రేపటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సేనాధిపతి ఉత్సవంతో షురూ..!
- ●Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?

సిక్స్‌ప్యాక్ కోసం నీళ్లకు బ్రేక్!.. స్క్రీన్‌పై లుక్ కోసం శరీరానికి షాక్!

Horoscope | అక్టోబర్ 11 రాశిఫలాలు.. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

City Crime | మైనర్ బాలిక అక్రమ రవాణా కేసులో 8 మంది అరెస్ట్.. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

Mogambo Modi | మొగాంబో మోదీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు



