Sunil Bansal | హైదరాబాద్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. నియోజకవర్గాలకెళ్లి పని చేసుకోండి
Sunil Bansal | తెలంగాణ బీజేపీ నాయకులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ (Sunil Bansal) గట్టి వార్నింగ్ ఇచ్చారు.
- ఇక నుంచి ఇక్కడే ఉండి అన్నీ చూస్తా
- బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ స్ట్రాంగ్ వార్నింగ్
Sunil Bansal | త్రినేత్ర న్యూస్: తెలంగాణ బీజేపీ నాయకుల( BJP Leaders)కు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ (Sunil Bansal) గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదని.. కేవలం హైదరాబాద్ ఆఫీసులో తిరిగితే సరిపోదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలని ముక్కు సూటిగా చురకలంటించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
నాయకులు క్షేత్రస్థాయి వరకు వెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలి. నేను ఇక నుంచి తెలంగాణలోనే ఉంటా. ఇక్కడే ఉండి అన్నీ పరిశీలిస్తా. సభలు, మైకులు వంటి అనవసరమైన ఆర్భాటాలు తగ్గించుకోవాలి. పని చేయనప్పుడు పదవులు ఎందుకు? వేరే వాళ్లకు ఇచ్చేయాలి.
నలుగురితో చాయ్ తాగి మాట్లాడితే ఆ ఇంపాక్టే వేరు
నాయకులు బహిరంగ సభలో మాట్లాడితే వచ్చే ఇంపాక్ట్ కంటే.. ప్రజల్లోకి వెళ్లి చిన్న సమూహం వద్ద నలుగురితో చాయ్ తాగి మాట్లాడినా చాలు. ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. చేసిన పనిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లకుంటే చేసి ప్రయోజనమేంటి? ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా తిప్పికొట్టాలి. జెన్ జీ ఉద్యమాలను తిప్పికొట్టేందుకు యువతకు సెమినార్లతో వాస్తవాలు వివరించాలి. ఎమ్మెల్సీ ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు ఎన్నికలకు సీరియస్‌గా పనిచేయాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. కాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం అయన తొలిసారి రాష్ట్రానికి వచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, రేఖా శర్మ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Headquarters Bar and Restaurant | బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తా.. బార్లో రివాల్వర్‌తో యువకుడి వార్నింగ్
అక్టోబర్ 24, 2026

Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు
అక్టోబర్ 24, 2026

TGPCB | నానక్‌రామ్‌గూడ, కోకాపేటలో వాయు కాలుష్యం.. చర్యలకు దిగిన పీసీబీ
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక
- ●Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి - 'ఇడుపుకాయితం' విమర్శలపై దర్శకుడి కౌంటర్
- ●Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు
- ●రెండు సీట్లు.. ఏడు పార్టీలకు పరీక్ష! తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో ఎవరి సవాల్ ఏంటి?
- ●Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో బిగ్‌బాస్ భామ - అప్డేట్పై ఫన్నీకామెంట్స్
- ●Ponguleti Srinivas Reddy | రూ.150 కోట్లతో మూడు మండలాల్లో శాశ్వత కరువు నివారణ చర్యలు

HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక

Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి - 'ఇడుపుకాయితం' విమర్శలపై దర్శకుడి కౌంటర్

Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు

రెండు సీట్లు.. ఏడు పార్టీలకు పరీక్ష! తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో ఎవరి సవాల్ ఏంటి?




