త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవ‌డానికి సంస్కారం కావాలి – ‘ఇడుపుకాయితం’ విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడి కౌంట‌ర్‌

ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ జంట‌గా న‌టిస్తోన్న ఇడుపుకాయితం సినిమా నుంచి ఏ ఇంటి కోయిల‌వో నువ్వు అనే పాట‌ను మేక‌ర్స్ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌లో తెలంగాణ పెళ్లి సంస్కృతిని చూపించిన తీరును విమ‌ర్శిస్తూ నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతోన్నారు.ఈ ట్రోల్స్‌పై డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రియాక్ట్ అయ్యారు. తెలంగాణను కించప‌ర‌చ‌డం సులువు అర్థం చేసుకోవ‌డానికి సంస్కారం కావాల‌ని అన్నారు.

N

Entertainment | Published On Oct 24, 2026, 8.54 pm IST

Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవ‌డానికి సంస్కారం కావాలి – ‘ఇడుపుకాయితం’ విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడి కౌంట‌ర్‌
Advertisement

Telangana |  ఇడుపుకాయితం సినిమాపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రియాక్ట్ అయ్యారు. తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవ‌డానికి సంస్కారం కావాలి అంటూ పోస్ట్ పెట్టారు. ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఇడుపుకాయితం మూవీ డిసెంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.ఈ సినిమా నుంచి ఏ ఇంటి కోయిల‌వో నువ్వు అనే పాట‌ను శుక్ర‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌లో తెలంగాణ పెళ్లి ఆచారాల‌ను అత్తారింటిలో తొలి సారి అడుగుపెట్టిన‌ప్పుడు కొత్త కోడ‌లు ఎదుర్కొనే భావోద్వేగాల‌ను స‌హ‌జంగా చూపించారంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కొంద‌రు మాత్రం ఈ పాట‌ను విమ‌ర్శిస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతోన్నారు. సి హైప్ కోస‌మే తెలంగాణ సంస్కృతిని పాట‌లో త‌ప్పుగా చూపించారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉండే ఆచారాల‌ను మొత్తం తెలంగాణ‌కే ఆపాదించేలా ఈ పాట‌లోని సీన్లు ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు..

కించ‌ప‌ర‌చ‌డం సులువు...

ఈ ట్రోల్స్‌పై డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల రియాక్ట్ అయ్యారు "ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి. దాని చరిత్రలో, శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి. తెలంగాణను కించపరచడం సులువు. అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి.
మన జీవితాల్ని, మన సంస్కృతిని తెరమీదకు తెచ్చే ఇడుపుకాయితం లాంటి సినిమాల్ని ఆదరించండి , రేపు రిలీజ్ అయ్యాక నచ్చకపోతే ఆ సినిమాను విమర్శించండి, తప్పు లేదు , కానీ ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని మీ అజ్ఞానంతో నిర్వచించకండి" అంటూ వేణు ఊడుగుల ట్వీట్ చేశారు.

టైటిల్ వివాదం...

ఇడుపుకాయితం టైటిల్‌పై కూడా వివాదం రేగింది. ఈ ప‌దానికి అర్థం ఏంటి? ఇది అస‌లు తెలుగు సినిమానేనా అంటూ నెటిజ‌న్లు చేసిన విమ‌ర్శ‌ల‌పై తెలంగాణ సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇడుపుకాయితం సినిమాకు వంశీరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత‌తో క‌లిసి బ‌న్నీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

Advertisement
Advertisement