త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Headquarters Bar and Restaurant | బిల్లు డ‌బ్బులు తిరిగివ్వ‌కుంటే కాల్చేస్తా.. బార్‌లో రివాల్వ‌ర్‌తో యువ‌కుడి వార్నింగ్‌

Headquarters Bar and Restaurant | హైద‌రాబాద్‌లో రివాల్వర్‌ (Revolver)తో ఓ యువ‌కుడు హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సోమాజిగూడ(Somajiguda)లో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌ బార్‌ అండ్‌ రెస్టరెంట్ (Headquarters Bar and Restaurant) రివాల్వర్‌తో బెదిరించిన ఘ‌ట‌న శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

S

Hyderabad | Published On Oct 24, 2026, 10.05 pm IST

Headquarters Bar and Restaurant | బిల్లు డ‌బ్బులు తిరిగివ్వ‌కుంటే కాల్చేస్తా.. బార్‌లో రివాల్వ‌ర్‌తో యువ‌కుడి వార్నింగ్‌
Advertisement

Headquarters Bar and Restaurant | త్రినేత్ర న్యూస్: హైద‌రాబాద్‌లో రివాల్వర్‌ (Revolver)తో ఓ యువ‌కుడు హల్‌చల్‌ చేయడం కలకలం సృష్టించింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సోమాజిగూడ(Somajiguda)లో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌ బార్‌ అండ్‌ రెస్టరెంట్ (Headquarters Bar and Restaurant) రివాల్వర్‌తో బెదిరించిన ఘ‌ట‌న శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బిల్లు డ‌బ్బులు తిరిగిచ్చేయ‌కుంటే కాల్చేస్తాన‌ని బెదిరించిన నిందితుడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

సోమాజిగూడ‌లోని బార్‌ అండ్‌ రెస్టరెంట్ రెండో అంతస్తులో బిల్లు విష‌యంలో కస్టమర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. దీంతో బౌన్సర్లు క‌ల్పించుకొని ఇరువర్గాలను బయటకు పంపించారు. అనంతరం వారిలో మ‌హ‌మ్మ‌ద్ షాన‌వాజ్ (24) అనే యువ‌కుడు సెల్లార్‌లో పార్క్‌ చేసిన తన వాహనం వద్దకు వెళ్లి రివాల్వర్‌ తీసుకుని తిరిగి రెస్టరంట్‌లోకి వచ్చేందుకు యత్నించాడు. సెల్లార్‌లో ఉన్న కస్టమర్లు, సిబ్బందిపై రివాల్వర్‌ చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. తాను చెల్లించిన బిల్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే కాల్చేస్తానని హెచ్చరించినట్లు బాధితులు తెలిపారు.

దీంతో అక్కడున్న కస్టమర్లు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బౌన్స‌ర్లు అత‌డిని అడ్డుకోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహమ్మద్‌ షానవాజ్‌ వద్ద నుంచి రివాల్వర్‌, కారును స్వాధీనం చేసుకున్నారు. శ‌నివారం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement