HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక
HMWSSB | హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథాపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి (HMWSSB) ఎండీ అశోక్‌రెడ్డి (MD Ashok Reddy) స్పష్టం చేశారు.
- నిబంధనలు పాటించకుంటే నవంబర్ 1 నుంచి చర్యలే
- నీటి వృథాపై జలమండలి మార్గదర్శకాల జారీ
HMWSSB | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ మహానగరంలో తాగునీటి వృథాపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి (HMWSSB) ఎండీ అశోక్‌రెడ్డి (MD Ashok Reddy) స్పష్టం చేశారు. జలమండలి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి వృథాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు తాజాగా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి వృథాకు పాల్పడితే నవంబర్ 1 నుంచి సంబంధిత ట్యాంకర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అదే ట్యాంకర్ రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తేల్చి చెప్పారు.
మూతలు సరిగా లేకపోతే..
నీటి లీకేజీలు, మూతలు లేని ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఉపయోగించవద్దు. ట్యాంకర్లపై మూతలు సరిగా లేకపోవడం వల్ల రవాణా సమయంలో నీరు రోడ్డుపై వృథాగా పోతున్నట్లు గుర్తించాం. రవాణా సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు అమలు చేయాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశాం.
ట్యాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలు, మూతల పరిస్థితిని పరిశీలించాలి. లోపాలను గుర్తిస్తే వాటిని సరిచేసే వరకు నీటిని నింపొద్దు. ఈ విషయంలో ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి అని ఎండీ అశోక్ రెడ్డి నొక్కిచెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి - 'ఇడుపుకాయితం' విమర్శలపై దర్శకుడి కౌంటర్
- ●Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు
- ●రెండు సీట్లు.. ఏడు పార్టీలకు పరీక్ష! తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో ఎవరి సవాల్ ఏంటి?
- ●Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో బిగ్‌బాస్ భామ - అప్డేట్పై ఫన్నీకామెంట్స్
- ●Ponguleti Srinivas Reddy | రూ.150 కోట్లతో మూడు మండలాల్లో శాశ్వత కరువు నివారణ చర్యలు
- ●HYDRAA | అక్రమ బోర్లపై 'హైడ్రా' కొరడా.. స్టింగ్ ఆపరేషన్ ద్వారా నీటి వ్యాపారం బట్టబయలు

Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి - 'ఇడుపుకాయితం' విమర్శలపై దర్శకుడి కౌంటర్

Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు

రెండు సీట్లు.. ఏడు పార్టీలకు పరీక్ష! తెలంగాణ ఎమ్మెల్సీ పోరులో ఎవరి సవాల్ ఏంటి?

Siri Hanumanth | అల్లు అర్జున్ రాకాలో బిగ్‌బాస్ భామ - అప్డేట్పై ఫన్నీకామెంట్స్




