PM Modi | బంగ్లాదేశ్‌కు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది.. తారిక్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ
PM Modi | బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు.
PM Modi | బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. బీఎన్‌పీ అధినేత తారిక్ రెహమాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తారిక్ గెలుపు దేశ ప్రజల్లో ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల దిశగా వెళ్తున్న బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు. ఆ దేశంతో బంధాలను బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు.
20 ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ (Tarique Rahman) నేతృత్వంలోని బీఎన్‌పీ భారీ మెజారిటీతో గెలుపొందింది. మొత్తం 299 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి బీఎన్‌పీ (BNP) 212 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు బీఎన్‌పీ ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో జమాతే ఏ ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 70 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్‌ను బీఎన్‌పీ దాటేసింది. ఆ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ఢాకా-17, బోగ్రా-6 స్థానాల నుంచి ఘన విజయం సాధించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






