Iranian oil tankers | ముంబై తీరంలో మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లు సీజ్
Iranian oil tankers | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) తీరంలో మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లను (Three Iranian oil tankers) భారత్ సీజ్ చేసింది.
Iranian oil tankers | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) తీరంలో మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లను (Three Iranian oil tankers) భారత్ సీజ్ చేసింది. ఆ నౌకలు అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నౌకలను ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) అదుపులోకి తీసుకుంది. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించింది.
ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఆపరేషన్‌లో స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియా అనే నౌకలను సీజ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఈ నౌకలు తరచూ పేర్లు మార్చుకోవడం, తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు తేలింది. అంతేకాదు, సముద్రం మధ్యలోనే ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును బదిలీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఆంక్షల నుంచి తప్పించుకోవడానికే విదేశాల్లో ఉన్న యజమానులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురును తరలించేందుకు 'షాడో ఫ్లీట్'గా వ్యవహరిస్తున్న ఈ నౌకలపై అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (OFAC) నిఘా ఉంచింది. భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్న వేళ ఇరాన్ చమురు నౌకలను భారత్ సీజ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు భారత్ సీజ్ చేసిన మూడు చమురు ట్యాంకర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్‌కు చెందిన 'నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ' (NIOC) స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!
- ●Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు






