త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diabetes | భార‌త్‌లో పెరుగుతున్న మధుమేహులు.. ప్ర‌పంచంలోనే రెండోస్థానం

Diabetes | మారుతున్న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలీతో దేశంలో షుగ‌ర్ (Diabetes) వ్యాధిగ్ర‌స్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో ప్ర‌పంచంలో మ‌ధుమేహంతో బాధ‌పుడుతున్న వ‌యోజుల సంఖ్య‌లో భార‌త్ (India) రెండో స్థానంలో నిలిచింది.

G

National | Published On Jan 17, 2026, 10.10 am IST

Diabetes | భార‌త్‌లో పెరుగుతున్న మధుమేహులు.. ప్ర‌పంచంలోనే రెండోస్థానం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మారుతున్న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలీతో దేశంలో షుగ‌ర్ (Diabetes) వ్యాధిగ్ర‌స్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో ప్ర‌పంచంలో మ‌ధుమేహంతో బాధ‌పుడుతున్న వ‌యోజుల సంఖ్య‌లో భార‌త్ (India) రెండో స్థానంలో నిలిచింది. 2024లో దేశంలో దాదాపు 9 కోట్ల మంది వ‌యోజనులు మ‌ధుమేహంతో జీవించార‌ని ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ప్ర‌పంచంలో షుగ‌ర్ వ్యాధితో బాధ‌పడుతున్న వ‌యోజనులు (adults) అత్య‌ధికంగా ఉన్న దేశాల జాబితాను `ది లాన్సెట్ డ‌యాబెటీస్ అండ్ ఎండోక్రైనాల‌జీ` జ‌ర్న‌ల్‌లో (Lancet Study) ప్ర‌చురిత‌మైంది. దీని ప్ర‌కారం..

14.8 కోట్ల మందితో చైనా (China) మొదటిస్థానంలో ఉండ‌గా, 3.9 కోట్ల మందితో అమెరికా (USA) మూడోస్థానంలో ఉంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన చైనా, భారత్, అమెరికా, పాకిస్థాన్ (Pakistan) వంటి దేశాలు మధుమేహుల వాటాను ఎక్కువగా కలిగి ఉన్నాయని తెలిపింది. ఈ విషయంలో 2050 నాటికి పాకిస్థాన్‌.. అమెరికాను దాటేయవచ్చని చెప్పారు. 215 దేశాలకు సంబంధించి 2005 నుంచి 2024 మధ్య జరిగిన 246 అధ్యయనాలను విశ్లేషించి, 2050 నాటి పరిస్థితిపై అంచనా వేశారు. ఈ అధ్య‌య‌నంలో బెల్జియంలోని ఇంట‌ర్నేష‌న‌ల్ డ‌యాబెటీస్ ఫెడ‌రేష‌న్‌, చెన్నైలోని ఇండియా డ‌యాబెటీస్ రీసెర్చ్ ఫౌండేష‌న్‌, డాక్ట‌ర్ ఏ.రామ‌చంద్ర‌న్ డ‌యాబెటీస్ హాస్పిట‌ల్‌కు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 58.9 కోట్ల మంది షుగ‌ర్ వ్యాధి బారినపడ్డారు. ఇది ప్రపంచ జనాభాలో 11 శాతం. ఈ సంఖ్య‌ 2050 నాటికి 85.3 కోట్లకు చేరవచ్చని పేర్కొన్నారు. 2024లో ప్రతి 9 మంది వయోజనుల్లో ఒకరు చ‌క్కెర వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇలాంటి వారి సంఖ్య ప్ర‌స్తుతం 50 కోట్లుగా ఉన్న‌ది. 2050 నాటికి ఈ సంఖ్య 90 కోట్ల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేశారు.

ఇకప్ర‌పంచవ్యాప్తంగా మధుమేహుల్లో 80 శాతం మంది పేద, మిడిల్‌-ఇన్‌క‌మ్‌ దేశాల్లోనే ఉన్నార‌ని వెల్ల‌డించారు. 2050 నాటికి ఈ దేశాల వాటా 95 శాతం కంటే ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చని తెలిపారు. జనాభా పెరుగుదల, పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, పట్టణీకరణ వంటివి ఈ సమస్యకు ప్ర‌ధాన కార‌ణంగా ఉన్నాయి. వ‌య‌స్సు పెరిగే కొద్దీ మ‌ధుమేహం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అధ్య‌యనం స్ప‌ష్టం చేసింది. 75 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో 25 శాతం మంది ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. వీరిలోనే మహిళల క‌న్నా పురుషులే ఎక్కువ‌గా మధుమేహం బారిన‌ప‌డుతున్నారు. అలాగే గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే వీరి సంఖ్య అధికంగా ఉంద‌ని పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement