INDIA Bloc | ‘బిల్లు’కు ఓటేయం.. ‘డీలిమిటేషన్’కు ఒప్పుకోం
INDIA Bloc | డీలిమిటేషన్ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయబోమని ఇండియా కూటమి విపక్షాలు తేల్చి చెప్పాయి. మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కానీ ప్రస్తుత విధానంలో ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి.
మహిళా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు
పార్లమెంట్‌లో పోరాడుతాం
ఇండియా కూటమి పక్షాల తీర్మానమిదే
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన
INDIA Bloc | త్రినేత్ర.న్యూస్ : డీలిమిటేషన్ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయబోమని ఇండియా కూటమి విపక్షాలు తేల్చి చెప్పాయి. మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదని కానీ ప్రస్తుత విధానంలో ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో బుధవారం న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఇండియా కూటమి విపక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి సమాజ్‌వాదీ, డీఎంకే, టీఎంసీ, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన యూబీటీ, ఆమ్ ఆద్మీ ప్రతినిధులు హాజరయ్యారు. కొందరు నేతలు జూమ్ ద్వారా చర్చలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ జై రాం రమేశ్ వివరాలు మీడియాకు వెల్లడించారు.
543 సీట్లలోనే 1/3 ఇవ్వండి
భేటీ వివరాలను ఖర్గే, జై రాం రమేశ్ వెల్లడిస్తూ.. బీజేపీ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమకు అస్సలు నమ్మకం లేదని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లుకు ఓటేయబోమని స్పష్టం చేశారు. అసోంలో, జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటికే వారు చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ వ్యవహారంతో బీజేపీయే లాభపడుతుందని ఆరోపించారు. డీలిమిటేషన్ కమిషన్ బీజేపీ చేతిలోనే ఉన్నట్టు కనిపించిందని చెప్పారు. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్ల ఆధారంగానే 2029 నుంచే మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాల్సిందిగా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నట్టు జైరాం రమేశ్ డిమాండ్ వెల్లడించారు. రేపు పార్లమెంటులో జరగబోయే చర్చలో పాల్గొంటామని కాని డీలీమిటేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకుండా ఇండియా కూటమి పక్షాలు సంయుక్తంగా తీర్మానించనిట్టు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






