Sundar Pichai | భారత్‌లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయా : సుందర్ పిచాయ్
Sundar Pichai | కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తాయని గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) అన్నారు.
Sundar Pichai | కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తాయని గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) అన్నారు. ఏఐ కోట్లాది మంది జీవితాలను మారుస్తుందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI impact summit 2026)లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని ప్రశంసించారు.
"నేను ప్రతి సారి భారత్‌ను సందర్శించినప్పుడు ఇక్కడి అభివృద్ధి వేగం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు విశాఖపట్నం మీదుగా ప్రయాణించేవాడిని. ఇప్పుడు అదే విశాఖ తీరంలో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటు అవుతుండటం గర్వకారణం. ఇందుకోసం 15 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాం. ఇది భారతదేశంలో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 'ఏఐ' సాంకేతికతను విస్తరిస్తుంది. భారతదేశం సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో ఎంతటి పురోగతి సాధించిందో దీనిని బట్టి అర్థమవుతోంది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
భారత్‌లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై కూడా సుందర్ పిచాయ్ మాట్లాడారు. ముఖ్యంగా రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ సమాచారం అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. గత వేసవిలో భారత ప్రభుత్వం లక్షలాది మంది రైతులకు ఖచ్చితమైన వాతావరణ అంచనాలను పంపిందని, ఇది గూగుల్ అభివృద్ధి చేసిన న్యూరల్ జీసీఎం మోడల్ సహాయంతో సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ న్యూరల్ జీసీఎం మోడల్ వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసి రైతులకు సమయానుకూల సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని ద్వారా వరదలు, ఎండలు, భారీ వర్షాలు వంటి విపరీత పరిస్థితులను ముందే తెలుసుకొని పంటలను రక్షించుకునే అవకాశం రైతులకు లభించింది. దీంతో నష్టాలను తగ్గించుకోవడంతో పాటు దిగుబడులు మెరుగుపడే అవకాశాలు కూడా పెరిగాయని ఆయన చెప్పారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






