Minister Sridhar Babu | మూసీ సుందరీకరణ పనులు ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu | మూసీ సుందరీకరణ పనులపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
Minister Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : మూసీ సుందరీకరణ పనులపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
మూసీ సుందరీకరణ పనులను ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రారంభిస్తామని శాసనసభా వేదికగా శ్రీధర్ బాబు ప్రకటించారు. హైదరాబాద్ ప్రజలందరూ స్వచ్ఛమైన నీటిని, గాలిని పీల్చుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జంట నగరాలతో పాటు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్ నగర ప్రజలకు కనీస వసతులు ఇవ్వాలనే ఆకాంక్షతో మూసీనదిని జీవనదిగా మార్చబోతున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ 70 ఏండ్లుగా మూసీ నదిని పట్టించుకోలేదు అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
మూసీ నది పునరుజ్జీవంపై అధ్యయనం కోసం జంట నగరాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు దక్షిణ కొరియా వెళ్లి స్టడీ చేశారు. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఇక నల్లగొండ జిల్లాలో ప్రవహించే మూసీ నదిని ప్రక్షాళన చేస్తేనే అక్కడ తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండవన్నారు. సిటీ విస్తీర్ణం పెరుగుతుంది.. మౌలిక వసతులు కల్పించుకునే భాగంలో మూసీ అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. మీరాలం ట్యాంక్ ఫీడర్ చానెల్‌ను మూసీ నదికి అనుసంధానం చేస్తాం. డీపీఆర్‌కు సంబంధించి మరో నాలుగు వారాల్లో వర్క్ పూర్తవుతుంది. ఫిబ్రవరి, మార్చిలో పనులు ప్రారంభిస్తాం. జోన్ 1ను రెండేండ్లలో పూర్తి చేస్తాం. ఇది ఒక కిలోమీటర్ ఉంటుంది అని శ్రీధర్ బాబు తెలిపారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



