CM Revanth Reddy | క్యూర్, ప్యూర్, రేర్ విధానంలో తెలంగాణ అభివృద్ధి
CM Revanth Reddy | రాష్ట్రాన్ని మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, CURE, PURE, RARE విధానంలో అభివృద్దిని విభజించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
- హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుతాం
- అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానం అనుసరిస్తాం
- ఈవీ వాహనాలుగా మార్చేందుకు ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్
- ఈవీ బస్సులతో కాలుష్యానికి చెక్ పెడతాం
- మూసీ అభివృద్ధిలో సంస్కృతిని అనుసంధానిస్తం
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రాన్ని మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, CURE, PURE, RARE విధానంలో అభివృద్దిని విభజించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం సీఎం, అధికారులు రాష్ట్ర అభివృద్ధిపై వివరించారు. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కమిటీకి వివరించారు.
ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ విధానం..
ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదు. మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం అని సీఎం రేవంత్ వివరించారు.

సర్వీస్ సెక్టార్‌గా క్యూర్ ఏరియా..
ఔటర్ రింగ్ రోడ్డు CURE ఏరియాను సర్వీస్ సెక్టార్ గా, ఔటర్ రింగ్ రోడ్డు బయట, రీజినల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న PURE ఏరియాను మాన్యూఫ్యాక్చర్ సెక్టార్ గా, రీజినల్ రింగ్ రోడ్డు బయట ఉన్న RARE ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్ గా గుర్తించాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానించబోతున్నాం అని పేర్కొన్నారు.
నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలి అని పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఉన్నతాధికారులు వివరించారు.

మూసీ పునరుజ్జీవం భేష్..
మూసీ పునరుజ్జీవం ఒక విప్లవాత్మక నిర్ణయమని పార్లమెంటరీ కమిటీ చైర్ పర్సన్, సభ్యులు కొనియాడారు. నదీ పునరుజ్జీవం దేశంలోనే మొదటిదని అభిప్రాయపడ్డారు. మూసీ పునరుజ్జీవం చేపట్టడంపై ముఖ్యమంత్రిని వారు అభినందించారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషిని కమిటీ సభ్యులు మెచ్చుకున్నారు.


సంబంధిత వార్తలు

Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ఆగస్టు 12, 2026

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
ఆగస్టు 12, 2026

Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- ●Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక
- ●Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..
- ●Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు
- ●Khushi Kapoor | బాలీవుడ్ హీరోయిన్ ఆ వీడియోలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు
- ●Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం

Indiramma Towers | రేపు ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Padi Kaushik Reddy | బెదిరిస్తే బెదరడానికి సిద్ధంగా లేను.. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక

Ayushman Card | ఇంటి నుంచే ఆయుష్మాన్ కార్డు.. వాట్సాప్‌లో ఇలా పొందండి..

Hospital Room Cost | ప్రైవేట్ ఆసుపత్రి గది అద్దె త్రీస్టార్ హోటల్ రేటుకు మించకూడదు.. పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు



