త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Ambulance | రూ.8 ల‌క్ష‌లు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ బుకింగ్‌.. ఒక‌రిని ర‌క్షించేందుకు మొద‌లుపెట్టిన జ‌ర్నీ ఏడుగురిని బ‌లితీసుకుంది

Air Ambulance | జార్ఖండ్ (Jharkhand)లోని చ‌త్రా జిల్లాలో సోమ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. సిమారియా స‌మీపంలో ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్ప‌కూలి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Feb 24, 2026, 2.39 pm IST

Air Ambulance | రూ.8 ల‌క్ష‌లు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్ బుకింగ్‌.. ఒక‌రిని ర‌క్షించేందుకు మొద‌లుపెట్టిన జ‌ర్నీ ఏడుగురిని బ‌లితీసుకుంది
Advertisement

Air Ambulance | జార్ఖండ్ (Jharkhand)లోని చ‌త్రా జిల్లాలో సోమ‌వారం రాత్రి ఘోరం జ‌రిగింది. సిమారియా స‌మీపంలో ఓ ఎయిర్ అంబులెన్స్ కుప్ప‌కూలి మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. హోట‌ల్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంజ‌య్ కుమార్‌ను ఎలాగైనా కాపాడుకోవాల‌ని అత‌డి కుటుంబం ఏకంగా రూ.8 ల‌క్ష‌లు అప్పుచేసి మ‌రీ ఈ ఎయిర్ అంబులెన్స్ (Air Ambulance)ను బుక్ చేసుకున్న‌ట్లు తెలిసింది. గాయ‌ప‌డిన సంజ‌య్‌ని ర‌క్షించేందుకు మొద‌లుపెట్టిన ఈ ప్ర‌యాణం అత‌డితోపాటూ మ‌రో ఆరుగురిని బ‌లితీసుకోవ‌డం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

లతేహర్ జిల్లా చాంద్వా ప్రాంతానికి చెందిన‌ సంజ‌య్ కుమార్ (41) స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న హోట‌ల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో సంజ‌య్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 65 శాతం కాలిన గాయాల‌తో రాంచీ (Ranchi)లోని దేవ్‌క‌మ‌ల్ ఆస్ప‌త్రిలో చేరాడు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే క‌ష్ట‌త‌రంగా భావించిన కుటుంబ స‌భ్యులు.. సంజ‌య్‌ని ఎలాగైనా కాపాడుకోవాల‌ని చెప్పి ఎయిర్ అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం ఆ ఫ్యామిలీ రూ.8 ల‌క్ష‌లు అప్పు చేసిన‌ట్లు తెలిసింది. రెడ్‌బర్డ్‌ ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (Redbird Airways Pvt Ltd) చెందిన బీచ్‌క్రాఫ్ట్‌ సీ90 ఎయిర్‌ అంబులెన్స్ (Beechcraft C90 air ambulance)ను బుక్‌ చేసింది.

సంజ‌య్‌తోపాటూ అత‌డి భార్య అర్చ‌న‌, మ‌రో బంధువు ధురు కుమార్‌తోపాటూ డాక్ట‌ర్ వికాస్ కుమార్ గుప్తా, ఓ స‌హాయ‌కుడు స‌చిన్ కుమార్ మిశ్రా, ఇద్ద‌రు పైల‌ట్లతో ఎయిర్ అంబులెన్స్ సోమ‌వారం రాత్రి రాంచీ నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరింది. అయితే కాసేప‌టికే వాతావ‌ర‌ణం మారిపోయింది. బ‌ల‌మైన ఈదురుగాలులు, భారీ వ‌ర్షాల‌తో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి. దీంతో పైల‌ట్లు ఎయిర్ అంబులెన్స్‌ను కోల్‌క‌తాకు మ‌ళ్లించాల‌ని భావించారు. అయితే, 7.11 గంట‌ల‌కు టేకాఫ్ అయిన ఈ అంబులెన్స్‌.. రాత్రి 7.30 గంట‌ల‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ త‌ర్వాత కాసేప‌టికే సిమారియా ప‌రిధిలోని బ‌రియ‌తు పంచాయ‌తీ ఏరియాలో భారీ శ‌బ్దంతో కుప్ప‌కూలిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో అందులోని ఏడుగురూ ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement