Commonwealth Games | 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ సన్నద్ధం
Commonwealth Games | 2030 కామన్వెల్త్ గేమ్స్, 2029 పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ నిర్వహణకు భారత్ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ చేస్తున్న బిడ్‌పైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ హాజరయ్యారు.
- అహ్మదాబాద్‌లో అమిత్ షా సమీక్ష
- ఒలింపిక్స్ 2036 బిడ్‌పైనా చర్చ
Commonwealth Games | 2030 కామన్వెల్త్ గేమ్స్, 2029 పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ నిర్వహణకు భారత్ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ చేస్తున్న బిడ్‌పైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ హాజరయ్యారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు భారత్‌ను ప్రపంచ స్థాయి క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 2029 పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిపారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలపైనా చర్చించినట్లు వెల్లడించారు.
2010 తర్వాత మళ్లీ భారత్‌లో..
2010లో దిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తర్వాత.. 2030లో భారత్ మరోసారి ఈ క్రీడా సంబరాలకు ఆతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, రవాణా, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణలో భద్రత, లాజిస్టిక్స్ అంశాల్లో కేంద్ర హోంశాఖ కీలకంగా వ్యవహరించనుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అనుభవాన్ని 2036 ఒలింపిక్స్ బిడ్‌కు ఉపయోగించుకునేలా సన్నాహాలు సాగుతున్నాయి. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని భారత్ ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అమిత్ షా సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే

Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు

Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు





