త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | ఏఐ డీప్‌ఫేక్ వీడియోల‌పై అమిత్ షాకు చిరంజీవి ఫిర్యాదు

న‌టీన‌టుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని సోష‌ల్ మీడియాలో పెరిగిపోతున్న‌ ఏఐ మార్ఫింగ్‌, డీప్‌ఫేక్ కంటెంట్‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని కేంద్ర మంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి కోరారు. అమిత్ షా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బేగంపేట‌లోని ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌లో అమిత్‌షాను మెగా హీరోలు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిశారు. వారితో అమిత్‌షా అరగంట‌కుపైనే ముచ్చ‌టించారు.

N

Naresh N

Entertainment | Published On Nov 2, 2026, 9.16 pm IST

ఏఐ టెక్నాల‌జీని దుర్వినియోగం చేస్తూ సినీ న‌టుల‌ను అస‌భ్య‌క‌రంగా చిత్రీక‌రిస్తోన్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల పెరిగిపోయాయి. ఈ స‌మ‌స్య‌ల గురించి అమిత్‌షాకు చిరంజీవి విన్న‌వించారు.
01/05

మార్ఫింగ్ , డీప్‌ఫేక్ వీడియోల కార‌ణంగా సినీన‌టుల గౌర‌వానికి, వారి హ‌క్కుల‌కు భంగం క‌లుగుతంద‌ని,  ఏఐ దుర్వినియోగాన్ని అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అమిత్ షాను చిరంజీవి కోరారు.
02/05

చిరంజీవి చెప్పిన విష‌యాల‌పై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.  ఈ స‌మ‌స్య‌కు సంబంధించి క‌ఠిన శిక్ష‌లు అమ‌లుప‌రిచే దిశ‌గా ప్ర‌భుత్వం కృషి చేస్తామ‌ని  హామీ ఇచ్చారు. దీనిపై ఓ లిఖిత పూర్వ‌క విన‌తి ప‌త్రం ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని  సూచించారు. .ఈ  బాధ్య‌త‌ల‌ను కిష‌న్ రెడ్డికి అప్ప‌గించారు.
03/05

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు అమిత్‌షాను క‌ల‌వ‌డం సినీ వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.
04/05

ఈ భేటీ వెనుక రాజ‌కీయ కోణం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఈ రూమ‌ర్ల‌కు మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.
05/05

Advertisement