త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMD Alert | మ‌రో వారం నిప్పుల వానే.. 48 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ‌త్ర‌లు పెరుగుతాయ‌ని ఐఎండీ వార్నింగ్..

IMD Alert | దేశంలో ఎండ‌లు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చాయి. ఉద‌యం నుంచే భానుడు నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నాడు. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే 48 డిగ్రీలకుపైగా ప‌గ‌టి ఉష్ణోగ‌త్ర‌లు న‌మోద‌య్యాయి. దాంతో సాధార‌ణ జ‌న‌జీవ‌నం పూర్తిగా ప్ర‌భావిత‌మైంది. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజల్లో హీట్ స్ట్రెస్ పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

P

National | Published On May 23, 2026, 4.42 pm IST

IMD Alert | మ‌రో వారం నిప్పుల వానే.. 48 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ‌త్ర‌లు పెరుగుతాయ‌ని ఐఎండీ వార్నింగ్..
Advertisement

IMD Alert | దేశంలో ఎండ‌లు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చాయి. ఉద‌యం నుంచే భానుడు నిప్పుల వ‌ర్షం కురిపిస్తున్నాడు. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇప్ప‌టికే 48 డిగ్రీలకుపైగా ప‌గ‌టి ఉష్ణోగ‌త్ర‌లు న‌మోద‌య్యాయి. దాంతో సాధార‌ణ జ‌న‌జీవ‌నం పూర్తిగా ప్ర‌భావిత‌మైంది. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజల్లో హీట్ స్ట్రెస్ పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌రో వారం పాటు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. మే 28 వరకు ఉత్తర పశ్చిమ, మధ్య, తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భార‌తంలో అనేక ప్రాంతాల్లో హీట్‌వేవ్ నుంచి తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు కొన‌సాగేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఏపీ, తెలంగాణ‌లోనూ..

శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో భారీగా ఉష్ణోగ‌త్ర‌లు రికార్డ‌య్యాయి. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో బాండాలో 48.2 డిగ్రీలు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఖజురహో 48, మహారాష్ట్ర బ్రహ్మపురి (విదర్భ) 47.2, వార్ధాలో 47.1, ఢిల్లీ నజఫ్‌గ‌ఢ్‌లో 47, హర్యానా రోహ్తక్‌లో 46.9, పంజాబ్ బఠిండాలో 46.6, నాగ్‌పూర్ 46.5, రాజస్థాన్ శ్రీ గంగానగర్‌లో 46.2, ప్ర‌యాగ్‌రాజ్ 46 డిగ్రీలు న‌మోదైంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వివ‌రించింది. వాతావ‌ర‌ణ‌శాఖ తూర్పు యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రాంతాల్లో 28 వ‌ర‌కు తీవ్ర‌మైన వేడిగాలులు వీస్తాయ‌ని తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా రాబోయే రోజుల్లో ఎండల ప్రభావం ఎక్కువగానే ఉంటుంద‌ని చెప్పింది. రాజస్థాన్‌లో ఇప్పటికే తీవ్ర‌మైన హీట్‌వేవ్ కొనసాగుతుండగా.. పశ్చిమ రాజస్థాన్‌లో ఈ నెల 28 వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్‌తో పాటు హిమాలయ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ఐఎండీ హెచ్చ‌రించింది.

రాత్రిళ్లు వేడిగాలులు..

ఉత్తరప్రదేశ్, విదర్భ, ఒడిశా, తెలంగాణలో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజంతా తీవ్ర‌మైన వేడితో ఇబ్బందులుప‌డ్డ జ‌నం.. క‌నీసం రాత్రిళ్లు సైతం ఉప‌శ‌మ‌నం లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులుప‌డుతున్నారు. రాత్రిళ్లు సైతం వేడిగాలులు వీస్తున్నాయి. దాంతో జ‌నం తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. అయితే, ఈ క్ర‌మంలో ఆరోగ్య స‌మ‌స్య‌లు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో ఇంట్లో గాలి బాగా ఆడేలా చూసుకోవాల‌ని.. వీలైనంత వ‌ర‌కు ఫ్యాన్లు, కూల‌ర్లు ఏర్పాటు చేసుకొని ఇంట్లోని వేడిగాలిని బ‌య‌ట‌కు పంపాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీరు తాగాల‌ని, దాహం వేయకపోయినా ఎప్పటికప్పుడు నీరు, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటార‌న్నారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఉప‌శ‌మ‌నం ఉంటుంద‌న్నారు.

మధ్య, తూర్పు, దక్షిణ భారతంపై..

మధ్యప్రదేశ్‌లో ఈ వారం పొడవునా తీవ్రమైన హీట్‌వేవ్ కొనసాగనుంది. జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో తేమతో కూడిన వేడి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ భారతంలో కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాం, తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎండ ప్రభావం కొనసాగనుంది. విజయవాడలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద గ్రీన్ షేడ్ నెట్‌లు ఏర్పాటు చేశారు. అలాగే, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో కూడా ఈసారి అసాధారణ వేడి నమోదవుతోంది. సాధారణంగా చల్లగా ఉండే ఈ ప్రాంతాల్లో కూడా హీట్‌వేవ్ ప్రభావం కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం ప‌డుతోంది.

నిపుణుల హెచ్చరిక

వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో హీట్‌వేవ్‌ల తీవ్రత‌తో పాటు వ్యవధి రెండూ పెరుగుతున్నాయి. ప్రతి దశాబ్దానికి సగటున 0.44 రోజులు హీట్‌వేవ్ కాలం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. పగటిపూట వేడి మాత్రమే కాకుండా, పెరుగుతున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు, తేమ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వృద్ధులు, పిల్లలు, బయట పనిచేసే కార్మికులు, ముందునుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారు హైరిస్క్‌లో ఉన్నార‌న్నారు. వీలైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో బయటకు వెళ్లడం మానుకోవాలని, తగినంత నీరు తాగాలని, ఆరోగ్య సలహాలను పాటించాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement