త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hate Speech | ఉన్న చ‌ట్టాలు చాలు.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అవ‌స‌రం లేదు.. హేట్ స్పీచ్ కేసులో సుప్రీం వ్యాఖ్య‌లు

Supreme Court | హేట్ స్పీచ్ కేసుల్లో శిక్షలు నిర్ణయించడం శాసనసభల బాధ్యతేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే ఉన్న చట్టాలే సరిపోతాయని పేర్కొంది. కొత్త‌గా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

P

National | Published On Apr 29, 2026, 12.41 pm IST

Hate Speech | ఉన్న చ‌ట్టాలు చాలు.. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అవ‌స‌రం లేదు.. హేట్ స్పీచ్ కేసులో సుప్రీం వ్యాఖ్య‌లు
Advertisement

Hate Speech | విద్వేషపూరిత ప్రసంగాల కేసులో కొత్త‌గా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు బుధ‌వారం నిరాక‌రించింది. ఈ సంద‌ర్భంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఏ నేరానికైనా శిక్ష‌ను నిర్ణ‌యిండం పూర్తిగా శాస‌న‌స‌భ‌ల ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి దేశంలో ఉన్న చట్టాలు సరిపోతాయని, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడేంత శాసనపరమైన శూన్యత ఏదీ లేదని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి అనుగుణంగా, న్యాయవ్యవస్థ తన పరిమితుల్లోనే వ్యవహరించగలదని జ‌స్టిస్ విక్ర‌మ్‌నాథ్‌, జ‌స్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని బెంచ్ స్ప‌ష్టం చేసింది.

కొత్త నేరాలను సృష్టించలేవ‌ని, శాసనసభలను చట్టాలు చేయమని బలవంతపెట్టడం తమ పరిధిలో లేదని తెలిపింది. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాలు హేట్ స్పీచ్ వంటి అంశాలను ఎదుర్కొనే సామర్థ్యం కలిగినవేనని స్పష్టం చేసింది. అందువల్ల హేట్ స్పీచ్ అంశంపై ప్రత్యేక న్యాయ మార్గదర్శకాలు అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. చట్టాల అమలు బాధ్యత సంబంధిత సంస్థలదేనని గుర్తుచేసింది. భవిష్యత్తులో కొత్త చట్టాలు అవసరమైతే, వాటిపై నిర్ణయం తీసుకోవడం శాసనసభల బాధ్యతేనని పేర్కొంది. భారత రాజ్యాంగం అధికార విభజన సూత్రంపై ఆధారపడి ఉందని, న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ తమ హద్దుల్లోనే పనిచేయాలని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ సందర్భంగా లా కమిషన్ 267వ నివేదికలో సూచించిన సంస్కరణలను కూడా ప్రస్తావించింది.

Advertisement
Advertisement