Supreme Court | కోర్టుల్లో గూండారాజ్ ఆమోదయోగ్యం కాదు : సుప్రీంకోర్టు
Supreme Court | ఢిల్లీ జిల్లాకోర్టులో న్యాయవాది, అతని క్లయింట్‌పై జరిగిన దాడి వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఓ న్యాయవాది తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ కోసం జాబితా చేయాలని కోరారు. కోర్టు హాల్‌లోనే తనతో పాటు క్లయింట్‌పై దాడి జరిగిందని ధర్మాసంన దృష్టికి తీసుకెళ్లారు.
Supreme Court | ఢిల్లీ జిల్లాకోర్టులో న్యాయవాది, అతని క్లయింట్‌పై జరిగిన దాడి వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఓ న్యాయవాది తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ కోసం జాబితా చేయాలని కోరారు. కోర్టు హాల్‌లోనే తనతో పాటు క్లయింట్‌పై దాడి జరిగిందని ధర్మాసంన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 7న ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులో అదనపు జిల్లా జడ్జి (ఏడీజే) హర్దీప్ సింగ్ పాల్ కోర్టు హాల్‌లో తనతో పాటు క్లయింట్‌పై దాడి జరిగిందని పేర్కొన్నారు. తన క్లయింట్ తరఫున వాదిస్తున్నప్పుడు, కొందరు గూండాలు వారిపై దాడి చేశారు. దాడి చేసిన వారు కోర్టు గది తలుపును లోపలి నుంచి గడియ పెట్టారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో న్యాయమూర్తి, కోర్టు సిబ్బంది సైతం అక్కడే ఉన్నారన్నారు.
నిందితుడికి మద్దతు ఇచ్చినందుకే తమపై కూడా దాడి చేశారని న్యాయవాది ఆరోపించారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన గురించి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశారా? అని సీజేఐ ప్రశ్నించారు. అధికారికంగా లేఖను రాస్తూ ఓ కాపీని తన వద్ద ఉంచుకోవాలని సూచించింది. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకపోతే అది చట్ట ఉల్లంఘన అవుతుందని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఘటన గూండారాజ్‌గా అభివర్ణించిన సీజేఐ.. దాడి ఘటనను ఖండించారు. ఇలాంటి సంఘటనలు సహించబోమని స్పష్టం చేసింది. ఈ విషయంపై మొదట ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని సూచించింది. కోర్టు ప్రాంగణంలో హింసకు తావు లేదని కోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






