లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్లకు భారీ షాకిచ్చిన ప్రభుత్వం
రూల్స్ ప్రకారం అన్ని వివరాలు సమర్పించిన తర్వాతనే 30 రోజుల్లో ఆ పెళ్లి చట్టబద్ధం అవుతుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్ ఆ జంట పెళ్లికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్ త్వరలోనే లాంచ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
త్రినేత్ర.న్యూస్ : ఒకరినొకరం ఇష్టపడ్డాం. ఇద్దరం మేజర్లం. లేచిపోయి పెళ్లి చేసుకుంటాం లేదంటే సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం. ఏ గుడిలోనో చేసుకుంటాం.. అని చెప్పే రోజులు పోయాయి ఇక. ప్రేమ పెళ్లిళ్లు, లేచిపోయి చేసుకునే పెళ్లిళ్లు చేసుకోవాలంటే ఇక నుంచి అంత ఈజీ కాదు. రిజిస్ట్రార్ ఆఫీసుకెళ్లి ఓ ఫామ్ నింపేసి సంతకం పెట్టగానే పెళ్లి అవ్వదు. దానికి పెళ్లి చేసుకోబోయే జంట ఇరు కుటుంబాలకు తమ పెళ్లి విషయం ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. వాళ్ల వివరాలన్నీ రిజిస్ట్రార్ ఆఫీసులో సమర్పించాల్సిందే. ఏ ఒక్క సమాచారం ఇవ్వకున్నా ఆ పెళ్లి చట్టబద్ధం కాదు. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్‌ను గుజరాత్ ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇద్దరు మేజర్లు అయితే చాలు కదా. వాళ్లకు పెళ్లి చేయొచ్చు కదా. ఇంకా కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఎందుకు? వాళ్లకు సమాచారం ఇవ్వడం ఎందుకు అనే సందేహం రావడం కామన్. కానీ.. ఇలాంటి కఠిన రూల్స్‌ను అక్కడి ప్రభుత్వం తీసుకురావడం వెనుక పెద్ద కారణమే ఉంది.
సురేష్‌గా నటిస్తూ సలీమ్ పెళ్లి చేసుకుంటే..?
ఇద్దరు మేజర్లు ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి పెళ్లి చేయాలంటూ రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్తే కేవలం వాళ్లిద్దరి వివరాలను ఆధారంగా చేసుకొని పెళ్లి చేస్తే ఆ తర్వాత ఆ జంటలో ఎవరికైనా ఒకరి వల్ల మరొకరికి సమస్యలు వస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజుల్లో కొన్ని మతాలు, కులాలకు చెందిన వాళ్లు వేరే మతాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. సురేష్‌గా నటిస్తూ వచ్చి సలీమ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి. ప్రేమ వివాహాలకు మేము వ్యతిరేకం కాదు. కానీ.. మతాంతర వివాహాల పేరుతో ప్రస్తుతం జరుగుతున్న ఫ్రాడ్స్‌ను అరికట్టడం కోసమే తాము ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నామని గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సాంఘ్వీ తెలిపారు. అసెంబ్లీలో దీనికి సంబంధించిన చట్టాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ః
గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ 2006లో సవరణ
ప్రేమ పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయకుండా నివారించడం కోసం గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ 2006ని చట్ట సవరణ చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఏ జంట అయినా సరే.. మ్యారేజీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును నింపేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరూ కలిసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తమ పేరెంట్స్‌కి తమ పెళ్లి గురించి సమాచారం ఇచ్చారా లేదా అనే వివరాలు తెలపాల్సి ఉంటుంది. అలాగే, తమ తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్స్ అన్నీ దరఖాస్తు ఫామ్‌లో ఇవ్వాలి. ఒకవేళ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పకపోతే.. పెళ్లికి దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో ఆ జంట సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రూల్స్ ప్రకారం అన్ని వివరాలు సమర్పించిన తర్వాతనే 30 రోజుల్లో ఆ పెళ్లి చట్టబద్ధం అవుతుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్ ఆ జంట పెళ్లికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్ త్వరలోనే లాంచ్ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






