త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

plane crashes | దేశంలో గ‌తేడాది 19 విమాన ప్ర‌మాదాలు : కేంద్రం

plane crashes | దేశంలో గ‌త ఏడాది కాలంలో 19 విమాన ప్రమాదాలు (plane crashes) జ‌రిగిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

D

National | Published On Feb 3, 2026, 1.30 pm IST

plane crashes | దేశంలో గ‌తేడాది 19 విమాన ప్ర‌మాదాలు : కేంద్రం
Advertisement

plane crashes | దేశంలో గ‌త ఏడాది కాలంలో 19 విమాన ప్రమాదాలు (plane crashes) జ‌రిగిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆయా ప్ర‌మాదాలు, తీవ్ర‌మైన ఘ‌ట‌న‌ల‌పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేష‌న్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) ద‌ర్యాప్తు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి ముర‌ళీధ‌ర్ మొహోల్ (Murlidhar Mohol) రాజ్య‌స‌భ‌ (Rajya Sabha)కు తెలిపారు. విప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వంగా స‌మాధానం ఇచ్చారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఆయా ఘ‌ట‌న‌ల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌న్నారు. ఒక తీవ్ర‌మైన ఘ‌ట‌న‌కు సంబంధించిన ద‌ర్యాప్తు పూర్తైంద‌ని ఆ నివేదిక ఏఏఐబీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంద‌న్నారు. మిగ‌తా ప్ర‌మాదాలు, తీవ్ర‌మైన ఘ‌ట‌న‌ల‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు వివ‌రించారు.

కాగా, గ‌తేడాది జ‌రిగిన విమాన ప్ర‌మాదాల్లో ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం ఒక‌టి. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గ‌తేడాది జులైలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ బ‌య‌ల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ స‌హా 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాదం నుంచి ఒకే ఒక్క‌రు స‌జీవంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

Advertisement
Advertisement