Gorilla Campaign | కోతుల బెడద.. వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో “గొరిల్లా ప్రచారం”
Gorilla Campaign | పంజాబ్ విశ్వవిద్యాలయంలో (Panjab University) కోతుల బెడదపై విద్యార్థి సంఘం ఎన్నికల (Student Council election) ప్రచారంలో విద్యార్థి సంఘాలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. క్యాంపస్‌లో "గొరిల్లా ప్రచారం" (Gorilla Campaign) నిర్వహించారు.
Gorilla Campaign | త్రినేత్ర.న్యూస్ : చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో (Panjab University) జరుగుతున్న విద్యార్థి సంఘం ఎన్నికల (Student Council election) ప్రచారం సరికొత్త మలుపు తిరిగింది. వర్సిటీ పరిధిలో పెరుగుతున్న కోతుల బెడదను (monkey menace) అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు.. విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఓ విద్యార్థితో గొరిల్లా వేషం (Gorilla Campaign) వేయించి క్యాంపస్‌లో ప్రచారం నిర్వహించారు.
'ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్' (ISO) ఉపాధ్యక్ష అభ్యర్థి విపుల్ భారతికి మద్దతుగా ఈ వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. హాస్టల్ ప్రాంగణం సహా క్యాంపస్ అంతటా గొరిల్లా దుస్తులు ధరించిన వ్యక్తితో కలిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. క్యాంపస్‌లో కోతుల సంచారం రోజురోజుకూ పెరిగిపోతోందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
యూనివర్సిటీ ప్రాంగణంలో, ముఖ్యంగా హాస్టళ్ల పరిసరాల్లో దాదాపు 800 నుండి 1,000 కోతులు సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కోతులు తరచూ హాస్టల్ గదుల్లోకి చొరబడి విద్యార్థుల ఆహారాన్ని, వస్తువులను లాక్కెళ్లడమే కాకుండా వారిపై దాడులు చేస్తూ భయాందోళనలను సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కేవలం ఒక సాధారణ సమస్యగా కాకుండా వర్సిటీ యంత్రాంగం, సంబంధిత అధికారులు శాశ్వత, ఆచరణాత్మక పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
కోతుల బెడదనే తమ ఎన్నికల ప్రచార అస్త్రంగా మలచుకున్న ఐసో మద్దతుదారులు.. హాస్యాన్ని, విద్యార్థుల గొంతుకను జోడించి వినూత్నంగా ముందుకు వెళ్లారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా.. ఓటర్లను ఆకట్టుకునేలా ఈ గొరిల్లా వేషధారణ ప్రచారాన్ని ఒక విజువల్ టూల్‌గా ఉపయోగించుకున్నారు. విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఈ "గొరిల్లా ప్రచారం" అందరి దృష్టిని ఆకర్షించింది.
Also Read..
సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ కలకలం.. సైన్యం అలర్ట్
కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు
73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్



