త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ratol | ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం.. పండ్ల‌కు ఎలుక‌ల మందు..!

Ratol | ప్ర‌స్తుతం మ‌నం తినే తిండి పూర్తిగా క‌ల్తీమ‌య‌మే. పూర్తిస్థాయిలో కెమిక‌ల్స్‌తో పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటున్నాం. దీనికి తోడు కొంత‌మంది పండ్ల విక్రేత‌లు ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు.

S

National | Published On Feb 26, 2026, 8.35 am IST

Ratol | ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం.. పండ్ల‌కు ఎలుక‌ల మందు..!
Advertisement

Ratol | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌స్తుతం మ‌నం తినే తిండి పూర్తిగా క‌ల్తీమ‌య‌మే. పూర్తిస్థాయిలో కెమిక‌ల్స్‌తో పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటున్నాం. దీనికి తోడు కొంత‌మంది పండ్ల విక్రేత‌లు ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. పండ్ల‌ను ఎలుక‌ల బారి నుంచి కాపాడుకునేందుకు.. వాటికి ఎలుక‌ల మందును రాస్తున్నారు. ఈ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఘ‌ట‌న మహారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని మాలాడ్ వెస్ట్ ఏరియాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

మాలాడ్ ఏరియాలో చాలా మంది తోపుడు బండ్ల‌పై పండ్ల‌ను విక్ర‌యిస్తుంటారు. కొంద‌రు స్థానికంగా స్టాళ్ల‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే రాత్రి స‌మ‌యాల్లో పండ్ల‌ను ఎలుక‌లు తింటున్నాయ‌ని విక్రేత‌లు గ‌మ‌నించారు. ఈ క్ర‌మంలో మ‌నోజ్ సంగంలాల్ కేస‌ర్‌వాణి(42), రాహుల్ సంద‌న్‌లాల్ కేస‌ర్‌వాణి(25) క‌లిసి ఎలుక‌ల బారి నుంచి పండ్ల‌ను కాపాడుకునేందుకు.. వాటికి రాటోల్ అనే ఎలుక‌ల మందును పూస్తున్నారు. ఈ త‌తంగాన్ని ఓ వ్య‌క్తి గ‌మ‌నించి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించాడు. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

రాహుల్, మ‌నోజ్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాటోల్ అనే ఎలుక‌ల మందును స్వాధీనం చేసుకున్నారు. పండ్ల‌ను సీజ్ చేశారు. బోరివాలిలోని అడిష‌న‌ల్ చీఫ్ మెట్రోపాలిట‌ర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. రాహుల్, మ‌నోజ్ మాలాద్ వెస్ట్‌లోని రాజ‌న్‌పాద ఏరియాకు చెందిన వార‌ని పోలీసులు తెలిపారు.

రాటోల్ అనే ఎలుక‌ల మందు విష‌పూరితమైన‌ది అని అధికారులు తేల్చారు. ఎలుక‌ల‌ను చంపేందుకు ఈ మందును వినియోగిస్తార‌ని పేర్కొన్నారు. అత్యంత విష‌పూరిత‌మైన మందును పండ్ల‌కు రాసి ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటమాడ‌డాన్ని స‌హించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు.

https://x.com/HateDetectors/status/2026653476558934048

Advertisement
Advertisement