త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Emmanuel Macron | 140 కోట్ల మంది ప్రజలకు భార‌త్‌ డిజిటల్ ఐడెంటిటీని తీసుకొచ్చింది : ఫ్రాన్స్ అధ్య‌క్షుడు

Emmanuel Macron | భారత్ డిజిటల్​ (UPI) విప్లవాత్మక మార్పులను ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (French President Emmanuel Macron) ప్ర‌శంసించారు.

D

National | Published On Feb 19, 2026, 12.05 pm IST

Emmanuel Macron | 140 కోట్ల మంది ప్రజలకు భార‌త్‌ డిజిటల్ ఐడెంటిటీని తీసుకొచ్చింది : ఫ్రాన్స్ అధ్య‌క్షుడు
Advertisement

Emmanuel Macron | భారత్ డిజిటల్​ (UPI) విప్లవాత్మక మార్పులను ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (French President Emmanuel Macron) ప్ర‌శంసించారు. 1.4 బిలియన్ల (140 కోట్ల) ప్రజలకు భార‌త్‌ డిజిటల్ ఐడెంటిటీ (digital identity)ని తెచ్చింద‌ని కొనియాడారు. త‌ద్వారా ఏ దేశం సాధించలేని ఘనత భారత్ సాధించింద‌న్నారు. ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సు (India AI Impact Summit)లో మాక్రాన్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా సాంకేతికత సామాన్య భారతీయుల దైనందిన జీవితాన్ని ఎలా మార్చేసిందో వివ‌రించారు.

“ప‌దేళ్ల కింద‌ట‌ భారత్‌లో బ్యాంకు ఖాతా తెరవాలంటే సమస్యగా ఉండేది. ముంబైలో ఓ వీధి వ్యాపారికి బ్యాంక్ ఖాతా తెర‌వ‌డం సాధ్యం కాలేదు. అడ్ర‌స్ లేదు, ప‌త్రాలు లేవు, అస‌లు అవ‌కాశ‌మే లేదు. కానీ అదే వ్యాపారి ఇప్పుడు త‌న ఫోన్ ద్వారా దేశంలోని ఎవ‌రి నుంచైనా త‌క్ష‌ణ‌మే పేమెంట్స్ స్వీక‌రిస్తున్నారు. ప్ర‌తి నెలా 20 బిలియ‌న్ల డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుగుతున్నాయి. 50 కోట్ల మందికి భార‌త్ డిజిట‌ల్ హెల్త్ కార్డుల‌ను ఇచ్చింది. ఆవిష్క‌ర‌ణ‌ల ప‌థంలో అంద‌రూ క‌లిసి ముందుకు సాగాలి. మానవాళికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం చేస్తుందని నమ్ముతున్నా. వ్యూహాత్మక పోటీకి ఏఐ ప్రధాన రంగంగా మారింది” అని మెక్రాన్ తెలిపారు. ఈ స‌ద‌స్సుకు త‌న‌ను ఆహ్వానించినందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి మాక్రాన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Advertisement
Advertisement