Naravane | ఆత్మకథ వివాదం.. రంగంలోకి దిగిన ఆర్మీ మాజీ చీఫ్ నరవణే..!
Naravane | భారత మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఆత్మకథ దేశ రాజకీయాలను కుదిపేస్తున్నారు. ఈ క్రమంలో వివాదానికి తెరించేందుకు తెరించేందుకు స్వయంగా నరవణే రంగంలోకి దిగారు.
Naravane | భారత మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఆత్మకథ దేశ రాజకీయాలను కుదిపేస్తున్నారు. ఈ క్రమంలో వివాదానికి తెరించేందుకు తెరించేందుకు స్వయంగా నరవణే రంగంలోకి దిగారు. తన పుస్తకం పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా విడుదల చేసిన అధికారిక ప్రకటనను ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో రీట్వీట్ చేశారు. ప్రస్తుతం స్టేటస్ ఇదేననని స్పష్టం చేశారు. పెంగ్విన్ సంస్థ ఇప్పటికే ఇచ్చిన ప్రకటనలో, ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరుతో ఉన్న ఈ ఆత్మకథ ఇప్పటివరకు ఏ రూపంలోనూ ముద్రించలేదని, డిజిటల్‌గానూ ప్రచురించలేదని, పంపిణీ చేయలేదని, విక్రయించలేదని, ప్రజలకు అందుబాటులో ఉంచలేదని స్పష్టం చేసింది.
ఇదే సందర్భంలో పెంగ్విన్ మరో తాజా ప్రకటన కూడా విడుదల చేసింది. పుస్తక ప్రకటన చేయడం, ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంచడం, పూర్తిగా ప్రచురించడం ఇవి మూడు వేర్వేరు అంశాలని తెలిపింది. ప్రీ-ఆర్డర్ అనేది కేవలం ముందస్తు బుకింగ్‌కే పరిమితమని, పుస్తకం మార్కెట్‌లోకి వచ్చినట్టుగా భావించొద్దని స్పష్టం చేసింది. నరవణే రాసిన పుస్తకం అనధికారికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా తమకే ప్రచురణ హక్కులు ఉన్నాయని.. పుస్తకం ఇంకా ప్రచురణ దశకు చేరలేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, ఏ రూపంలోనూ ఈ పుస్తక ప్రతులు విడుదల కాలేదని పెంగ్విన్ స్పష్టంగా పేర్కొంది.
ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ప్రతులు కాపీరైట్ ఉల్లంఘన కింద పరిగణిస్తామని హెచ్చరించింది. గత వారం పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పుస్తక ప్రతిని ప్రదర్శించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం మరోసారి కేంద్ర ప్రభుత్వం, పెంగ్విన్ ప్రచురణ సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. బుక్ ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో ఉందని, అసౌకర్యకరమైన నిజాలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఈ పుస్తకం అమెజాన్ ఈ-కామర్స్ వేదికపై అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణను పెంగ్విన్ పూర్తిగా ఖండించింది.
https://x.com/ManojNaravane/status/2021195945598452200
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






