త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Schools Bandh | బీ అల‌ర్ట్.. రేపు తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్..!

Schools Bandh | నీట్ పేప‌ర్ లీకేజీకి కేంద్రం బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిల‌పునిచ్చాయి.

S

Telangana | Published On Jul 23, 2026, 3.53 pm IST

Schools Bandh | బీ అల‌ర్ట్.. రేపు తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్..!
Advertisement

Schools Bandh | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్ లీకేజీకి కేంద్రం బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిల‌పునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

నీట్‌కు మ‌ద్ద‌తుగా గ‌త కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చ‌ర్య‌ల‌ను ఆయా సంఘాల నాయ‌కులు ఖండించారు. బంద్‌కు విద్యాసంస్థ‌లు స‌హ‌క‌రించి, నీట్ విద్యార్థుల‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు.

ప్ర‌వేశ పరీక్షలు సరిగా నిర్వహించకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే నీట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని నినదించారు. ఈ డిమాండ్‌లు నెరవేరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు సహకరించాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందులో భాగంగా శుక్రవారం జరిగే విద్యాసంస్థల బంద్‌కు సహకరించాలని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు.

Advertisement
Advertisement