Odisha | పోలీసుల వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం
Odisha | త్రినేత్ర.న్యూస్: ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు.
Odisha | త్రినేత్ర.న్యూస్: ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారి 49పై ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సహాయంతో గాయపడిన ముగ్గురిని పోలీసులు దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరణించిన వారిని ఏపీఆర్ పోలీసులు కాశీరామ్ భోయ్, దేబ్దత్ సా, డ్రిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజుర్, ఏపీఆర్ హవల్దార్ లింగరాజ్ ధురువా, హోంగార్డు భక్తబంధు మిర్ధాగా గుర్తించారు. ఇద్దరు ఏపీఆర్ పోలీసులు, ఒక సార్జెంట్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వారంతా రంగాలి ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్ వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేశామని, వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






