త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire | ఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో మంట‌లు

Fire | మ‌హారాష్ట్ర (Maharashtra)లోని వార్ధా (Wardha) జిల్లాలో న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలు (New Delhi-Chennai Grant Trunk Express)లో మంట‌లు (Fire) చెల‌రేగాయి.

D

National | Published On Feb 17, 2026, 2.09 pm IST

Fire | ఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో మంట‌లు
Advertisement

Fire | మ‌హారాష్ట్ర (Maharashtra)లోని వార్ధా (Wardha) జిల్లాలో న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలు (New Delhi-Chennai Grant Trunk Express)లో మంట‌లు (Fire) చెల‌రేగాయి. రైలు మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌హారాష్ట్ర నాగ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో బ‌య‌ల్దేరింది. వార్ధాలోని సింధి రైల్వే స్టేష‌న్ స‌మీపంలోకి రాగానే రైలు చివ‌రి గార్డ్ కోచ్‌లో పొగ‌లు వ‌చ్చాయి. గ‌మ‌నించిన ప్ర‌యాణికులు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

రంగంలోకి దిగిన అధికారులు రైలును సిండి-తుల్జాపూర్ సెక్ష‌న్‌లో ఆపేశారు. మంట‌లు చెల‌రేగిన కోచ్‌ను రైలు నుంచి వేరు చేశారు. అనంత‌రం అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. అక్క‌డికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేశారు. అదృష్ట‌వ‌శాత్తూ ప్ర‌మాదాన్ని ముందుగానే ప‌సిగ‌ట్ట‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభవించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులంతా సేఫ్‌గా ఉన్నార‌ని అధికారులు తెలిపారు. ఎవ‌రికీ గాయాలు కూడా కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. కాసేప‌టి త‌ర్వాత రైలు తిరిగి త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించింది. ఇక ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న రైల్వే ప్రొటెక్ష‌న్ పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో రైల్లోని ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

Advertisement
Advertisement