త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kakinada | కాకినాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకున్న 20 మంది కార్మికులు..!

Kakinada | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. సామ‌ర్ల‌కోట మండ‌లం వేట్ల‌పాలెంలోని ఓ బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో మంట‌లు చెల‌రేగాయి.

S

National | Published On Feb 28, 2026, 2.57 pm IST

Kakinada | కాకినాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. మంట‌ల్లో చిక్కుకున్న 20 మంది కార్మికులు..!
Advertisement

Kakinada | త్రినేత్ర‌.న్యూస్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. సామ‌ర్ల‌కోట మండ‌లం వేట్ల‌పాలెంలోని ఓ బాణ‌సంచా త‌యారీ కేంద్రంలో మంట‌లు చెల‌రేగాయి. అగ్నికీల‌లు ఎగిసిప‌డుతున్నాయి. మంట‌ల్లో 20 మంది కార్మికులు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేస్తుంది. ట‌పాసులు త‌యారు చేస్తుండ‌గా మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు తేల్చారు. ఈ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement