త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Machkund Hydroelectric Project | మాచ్‌ఖండ్ జ‌ల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం.. రెండో అంతస్తులో చిక్కుకున్న కార్మికులు

Machkund Hydroelectric Project | మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభ‌వించింది. పవర్‌ స్టేషన్‌ షట్‌డౌన్‌ అయిన అనంతరం నెంబరు 1 జెనరేటర్​కు చెందిన ట్రాన్స్​ఫార్మర్ బుషింగ్ కాలిపోయి మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెల‌కొంది.

S

National | Published On May 23, 2026, 1.35 pm IST

Machkund Hydroelectric Project | మాచ్‌ఖండ్ జ‌ల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం.. రెండో అంతస్తులో చిక్కుకున్న కార్మికులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభ‌వించింది. పవర్‌ స్టేషన్‌ షట్‌డౌన్‌ అయిన అనంతరం నెంబరు 1 జెనరేటర్​కు చెందిన ట్రాన్స్​ఫార్మర్ బుషింగ్ కాలిపోయి మంట‌లు చెల‌రేగాయి. ప‌వర్‌ స్టేషన్‌ రెండో అంతస్తులో ప‌నిచేస్తున్న‌ కార్మికులు అక్క‌డే చిక్కుకుపోయారు. వారిని వెలుపలికి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్ర‌మాద ప్ర‌దేశంలో మంట‌లు చెల‌రేగుతుండ‌గా దట్టమైన పొగ‌లు వ్యాపించాయి. దీంతో ఎవరూ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెల‌కొంది. ఈరోజు ఉదయం 6.30కు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏపీ, ఒడిశా ఉమ్మ‌డి జ‌ల విద్యుత్ కేంద్రం..

దట్టమైన పొగ అలముకోవడంతో రెండో అంతస్తులో చిక్కుకున్న కార్మికుల కోసం చేప‌ట్టిన‌ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. కొండల మధ్యలో జల విద్యుత్‌ కేంద్రం వ‌ద్ద‌కు ఎట్ట‌కేల‌కు సిబ్బంది చేరుకొని జనరేటర్లను (టర్బైన్లు) ఆపేసి, మంటలను అదుపు చేశారు. కార్మికులు ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వ‌హిస్తున్నాయి. జల విద్యుత్‌ కేంద్రంలో 120 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జ‌రుగుతోంది.

ఉదయం నుంచి ఓనకడిల్లి, మాచ్ ఖండ్​, జోలపుట్ క్యాంపులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యుత్త్​ ఉత్పత్తిని నిలిపివేశారు. సాయంత్రానికి విద్యుత్​ ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ప్రాజెక్ట్ ఎస్​ఈ కె.వి. నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్ర నుంచి బ్యాక్ ఫీడింగ్ ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement