త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farmer | భార్య‌కు ప‌క్ష‌వాతం.. జ‌న‌నాంగాన్ని గొడ్డ‌లితో న‌రుక్కున్న రైతు..!

Farmer | ఓ రైతు దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న జ‌న‌నాంగాన్ని గొడ్డ‌లితో నరుక్కున్నాడు. ఆ త‌ర్వాత దాన్ని బావిలో ప‌డేసి.. కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించాడు.

S

National | Published On May 31, 2026, 7.15 am IST

Farmer | భార్య‌కు ప‌క్ష‌వాతం.. జ‌న‌నాంగాన్ని గొడ్డ‌లితో న‌రుక్కున్న రైతు..!
Advertisement

Farmer | త్రినేత్ర‌.న్యూస్ : ఓ రైతు దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న జ‌న‌నాంగాన్ని గొడ్డ‌లితో నరుక్కున్నాడు. ఆ త‌ర్వాత దాన్ని బావిలో ప‌డేసి.. కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛ‌త‌ర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఛ‌తర్‌పూర్ జిల్లాకు చెందిన రామ్ మిలాన్ యాద‌వ్(42) వృత్తి రీత్యా రైతు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. అయితే గ‌త కొంత‌కాలం నుంచి భార్య ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతోంది. దీంతో యాద‌వ్ సంసార జీవితానికి దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే గంజాయికి బానిస‌గా మారాడు.

ఇక భ‌విష్య‌త్‌లో తాను పాప‌పు ప‌నులు చేయొద్ద‌ని నిర్ణ‌యించుకున్న అత‌ను త‌న బావి వ‌ద్దకు శ‌నివారం ఉద‌యం వెళ్లాడు. మొత్తానికి సాధువుగా మారాల‌ని గ‌ట్టిగా మ‌న‌సులో అనుకున్నాడు. ఇక అక్క‌డ గొడ్డ‌లితో త‌న జ‌న‌నాంగాన్ని నరుక్కున్నాడు. అనంత‌రం దాన్ని బావిలో ప‌డేసి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించాడు.

హుటాహుటిన బావి వ‌ద్ద‌కు చేరుకున్న కుటుంబ స‌భ్యులు.. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న రైతును చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఛ‌త‌ర్‌పూర్ జిల్లా ఆస్ప‌త్రిలో బాధిత రైతుకు చికిత్స కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం రైతు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

జూన్ 20న కుమార్తె పెళ్లి

రామ్ మిలాన్ యాద‌వ్ కుమార్తె పెళ్లి జూన్ 20న జ‌ర‌గాల్సి ఉంది. అయితే భార్య ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతుండ‌డం, పెళ్లికి స‌రిపడా డ‌బ్బులు లేక‌పోవ‌డంతో యాద‌వ్ మ‌రింత కుంగిపోయాడు. తీవ్ర ఆందోళ‌న‌కు గురై మాన‌సికంగా మ‌రింత కుదేలైన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

Advertisement
Advertisement