Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? ‘AI బబుల్’పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
AI పేరుతో టెక్ కంపెనీల షేర్లు విపరీతంగా పెరగడంపై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు వార్నింగ్ ఇచ్చారు. ఇది 1999 డాట్-కామ్ బబుల్ కన్నా పెద్ద ప్రమాదమని హెచ్చరించారు.
Technology | Published On May 31, 2026, 10.00 pm IST
Sridhar Vembu AI Bubble | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవానే నడుస్తోంది. ఈ AI బూమ్‌తో పెద్ద పెద్ద టెక్ కంపెనీల షేర్లు, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌పై ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో కార్పొరేషన్ (Zoho Corporation) ఫౌండర్ శ్రీధర్ వేంబు ఇన్వెస్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్నది 'AI బబుల్' అని, ఇది 1999 నాటి డాట్-కామ్ బబుల్ (Dot-com bubble) కన్నా పెద్ద ప్రమాదమని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
అస్సలు లాజిక్ లేదు.. ఇదొక పిచ్చి బుడగ
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్ కంపెనీల వాల్యుయేషన్లు (Valuations) ప్రస్తుతం వాటి వాస్తవ వ్యాపార లాభాలకు, బిజినెస్ ఫండమెంటల్స్‌కు పొంతన లేకుండా పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌విడియా (Nvidia), ఆపిల్ (Apple), ఆల్ఫాబెట్ (Alphabet), మైక్రోసాఫ్ట్ (Microsoft), మెటా (Meta), మైక్రాన్ టెక్నాలజీ (Micron Technology) వంటి బడా కంపెనీలు తమ వార్షిక ఆదాయం కన్నా అత్యంత భారీ రేషియోలతో ట్రేడ్ అవుతున్నాయని లెక్కలతో సహా వివరించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని ఒక "ఇన్సేన్ బబుల్" (Insane bubble - పిచ్చి బుడగ) గా ఆయన అభివర్ణించారు.
బయటపడిన ప్రైస్-టు-సేల్స్ లెక్కలు
శ్రీధర్ వేంబు తెలిపిన లెక్కల ప్రకారం.. ఎన్విడియా ప్రైస్-టు-సేల్స్ రేషియో (Price-to-sales ratio) దాని వార్షిక ఆదాయం కన్నా 20 రెట్లు (20x) ఎక్కువగా ఉంది. అలాగే ఇతర కంపెనీల లెక్కలు చూస్తే:
ఆపిల్: 10x
ఆల్ఫాబెట్ (గూగుల్): 11x
మైక్రోసాఫ్ట్: 10x
మెటా: 7.5x
మైక్రాన్: 19x గా ట్రేడ్ అవుతున్నాయి.
స్కాట్ మెక్‌నీలీ మాటలను గుర్తుచేస్తూ
తన వాదనకు బలాన్ని చేకూర్చేందుకు 2002లో డాట్-కామ్ బబుల్ క్రాష్ అయిన తర్వాత సన్ మైక్రోసిస్టమ్స్ (Sun Micro) ఎగ్జిక్యూటివ్ స్కాట్ మెక్‌నీలీ చేసిన కామెంట్స్‌ను శ్రీధర్ వేంబు గుర్తుచేశారు. ఒక ఇన్వెస్టర్ ఏదైనా కంపెనీలో దాని ఆదాయానికి 10 రెట్లు (10x revenues) ఎక్కువ ధరకు షేర్లు కొంటే.. ఆ పెట్టుబడికి పదేళ్లలో ప్రతిఫలం దక్కాలంటే, ఆ కంపెనీ వరుసగా పదేళ్ల పాటు తన ఆదాయంలో 100 శాతాన్ని ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉంటుందని స్కాట్ అప్పట్లో వివరించారు. అంటే ఇప్పుడున్న వాల్యుయేషన్లు ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వేంబు పరోక్షంగా హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో అద్భుతమైన గ్రోత్ వస్తుందనే అంచనాలతో ప్రస్తుతం సెమీకండక్టర్లు, సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు విపరీతంగా ర్యాలీ చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త ఆల్-టైమ్ హై లను తాకుతున్న ఈ తరుణంలో జోహో ఫౌండర్ చేసిన ఈ హెచ్చరికలు మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Price to Sales ratio for big tech (not price to earnings):
1. Nvidia: 20x
2. Apple: 10x
3. Alphabet (Google): 11x
4. Microsoft: 10x
5. Meta: 7.5x
6. Micron: 19x
As Scott McNealy of Sun Micro said back on 2002: "At 10x revenues, to give you a ten-year payback, I have to pay…
— Sridhar Vembu (@svembu) May 30, 2026
తాజావార్తలు
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు
- ●Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?
- ●CM Revanth Reddy Asifabad Tour | ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత షురూ: రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
- ●Suriya | కోలీవుడ్ హీరో గొప్ప మనసు - సినిమా టీమ్ మెంబర్స్‌కు లగ్జరీ కార్లు గిఫ్ట్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్

Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?





