త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Agniveers | కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో.. మాజీ అడ్నివీర్‌ల‌కు 20 శాతం రిజ‌ర్వేష‌న్లు

Agniveers | కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో మాజీ అగ్నివీర్‌ల‌కు (Agniveers) ఢిల్లీ పోలీసులు 20 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. అదేవిధంగా ఫిజిక‌ల్ ఎఫిసియెన్సీ టెస్ట్‌తోపాటు (Physical Test) వ‌యోప‌రిమితిలో మిన‌హాయింపులు ఇచ్చింది.

G

National | Published On Mar 29, 2026, 11.28 am IST

Agniveers | కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో.. మాజీ అడ్నివీర్‌ల‌కు 20 శాతం రిజ‌ర్వేష‌న్లు
Advertisement

Agniveers | కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో మాజీ అగ్నివీర్‌ల‌కు (Agniveers) ఢిల్లీ పోలీసులు 20 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. అదేవిధంగా ఫిజిక‌ల్ ఎఫిసియెన్సీ టెస్ట్‌తోపాటు (Physical Test) వ‌యోప‌రిమితిలో మిన‌హాయింపులు ఇచ్చింది. ఈ మేర‌కు హోం శాఖ నోటిఫికేష‌న్ ఇచ్చింది. నాలుగేండ్ల కాల‌మిరితిని ముగించుకున్న అగ్నివీర్ల‌కు ఢిల్లీ పోలీసుల నియామ‌కాల్లో రిక్రూట్‌మెంట్ పాల‌సీని ప్ర‌క‌టించింది.

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) నియామ‌కాల్లో వ‌యోప‌రిమితిలో మూడేండ్ల స‌డ‌లింపు ఇచ్చింది. ప్ర‌స్తుతం 18 నుంచి 25 ఏండ్లుగా ఉన్న‌ది. మొద‌టి బ్యాచ్‌కు చెందిన అగ్నివీర్‌ల‌కు వ‌యోప‌రిమితిలో ఐదేండ్ల స‌డ‌లింపు ఇచ్చారు. దీంతో మొద‌టి బ్యాచ్‌కు చెందిన అగ్నివీర్ల‌లో 30 ఏండ్ల‌లోపు ఉన్న‌వారు కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు అర్హుల‌ని వెల్ల‌డించింది.

Advertisement
Advertisement