త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal | బెంగాల్‌లో మ‌రోసారి రీ పోలింగ్‌.. ఫాల్తా నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక ర‌ద్దు

West Bengal | ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal) మరోసారి రీ పోలింగ్​ (Re Polling) జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని (Falta Assembly Constituency) మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మ‌రోసారి పోలింగ్ నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ECI) నిర్ణ‌యించింది.

G

National | Published On May 3, 2026, 11.41 am IST

West Bengal | బెంగాల్‌లో మ‌రోసారి రీ పోలింగ్‌.. ఫాల్తా నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక ర‌ద్దు
Advertisement

West Bengal | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal) మరోసారి రీ పోలింగ్​ (Re Polling) జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని (Falta Assembly Constituency) మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మ‌రోసారి పోలింగ్ నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ECI) నిర్ణ‌యించింది. రెండో విడ‌త‌లో భాగంగా ఏప్రిల్ 29న అక్క‌డ పోలింగ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తీవ్ర‌మైన ఎన్నిక‌ల ఉల్లంఘ‌న‌లు, ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను దెబ్బ‌తీసే చ‌ర్య‌లు జ‌రిగాయ‌ని నిర్ధారించిన ఈసీ.. ఎన్నిక‌ను ర‌ద్దు చేసింది. మే 21న నియోజ‌క‌వ‌ర్గంలోని 258 పోలింగ్ కేంద్రాల‌లో మ‌ళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 24న ఓట్లు లెక్కిస్తామ‌ని ఈసీ తెలిపింది.

ఫాల్తా నియోజ‌క‌వ‌ర్గంలో ఓటర్లను బెదిరించడం, ఈవీఎంలో బీజేపీ గుర్తు కనపడకుండా స్టికర్‌ వేయడం, అనధికార వ్యక్తులు పోలింగ్‌ బూత్‌లలోకి వచ్చారనే ఆరోపణలు వచ్చాయి. శనివారం ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఇటీవలి ఎన్నిక సందర్భంగా టీఎంసీ వర్గాలు తమను బెదిరించాయని, స్వేచ్ఛగా ఓటు వేయనీయలేదని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల‌ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈసీ.. రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది.

కాగా, రెండో విడ‌త‌లోనే అక్రమాలు జరిగాయన్న కారణంతో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మగ్రాహాట్​ పశ్చిమ్ (11 బూత్​లు), డైమండ్ హార్బర్ (4 బూత్​లు)​ అసెంబ్లీ స్థానాల్లోని పలు బూత్​ల్లో శనివారం (మే 2న‌) రీ పోలింగ్ నిర్వ‌హించారు.

Advertisement
Advertisement