త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | జ‌మ్ము క‌శ్మీర్‌, అండ‌మాన్ దీవుల్ని వ‌ణికించిన భూకంపం

Earthquake | జ‌మ్ము క‌శ్మీర్ (Jammu and Kashmir)లో భూకంపం సంభ‌వించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:35 గంట‌ల‌కు బారాముల్లా (Baramulla) జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భూ ప్రకంప‌న‌లు చోటు చేసుకున్నాయి.

D

National | Published On Feb 2, 2026, 10.34 am IST

Earthquake | జ‌మ్ము క‌శ్మీర్‌, అండ‌మాన్ దీవుల్ని వ‌ణికించిన భూకంపం
Advertisement

Earthquake | జ‌మ్ము క‌శ్మీర్ (Jammu and Kashmir)లో భూకంపం సంభ‌వించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున 5:35 గంట‌ల‌కు బారాముల్లా (Baramulla) జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భూ ప్రకంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 4.6గా న‌మోదైన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ (National Center of Seismology) వెల్ల‌డించింది. ప‌ఠాన్ ఏరియాలో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన‌ట్లు అధికారులు నిర్ధారించారు. ఈ భూ ప్ర‌కంప‌న‌ల‌తో గాఢ నిద్ర‌లో ఉన్న ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌లేదు.

ఇదిలా ఉండ‌గా.. సోమ‌వారం తెల్ల‌వారుజామున 3:30 గంట‌ల‌కు అండ‌మాన్ నికోబార్ దీవుల్లో ( Andaman and Nicobar Islands)నూ భూమి కంపించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 4.6గా న‌మోదైన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ వెల్ల‌డించింది. భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు తెలిపింది.

Advertisement
Advertisement