Bitter Gourd | కాకరకాయ కూర వండిందని.. కన్న తల్లిని కొట్టి చంపాడు..
త్రినేత్ర.న్యూస్: కాకరకాయ కూర (Bitter Gourd) ఓ తల్లి ప్రాణాలు పోయేలా చేసింది. పూటుగా తాగొచ్చిన (Alcohol Addicted) కొడుకు.. కాకర కాయ కూర వండిందని తల్లితో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
చంద్రాపూర్ (Chandrapur) జిల్లా డోంగర్‌గావ్ కు చెందిన సుమిత్రా పెట్కూలె (65), జగదీశ్ పెట్కూలె (37) తల్లీకొడుకులు. జగదీశ్‌కు వివాహం అయినప్పటికీ భార్య అతనికి దూరంగా ఉంటున్నది. మద్యానికి బానిసైన అతడు రోజూ తాగివచ్చి గొడవ పడుతుంటంతో రెండు నెలల క్రితమే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లీ కొడుకులు ఇద్దరే ఉంటున్నారు.
కాగా, గత రాత్రి పూటుగా తాగి వచ్చిన జగదీశ్.. సుమిత్రను అన్నం పెట్టమని అడిగాడు. దీంతో ఆమె అన్నంతోపాటు కాకర కాయ కూర వడ్డించింది. దీంతో కాకరకాయ ఎందుకు వండావని తల్లితో వాగ్వాదానికి దిగాడు. అదికాస్త పెద్దదికావడంతో ఇద్దరిమధ్య గొడవకు దారితీసింది. ఆగ్రహంతో సుమిత్రపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
అనంతరం ఊర్లో తిరుగుతూ తాను తన తల్లిని చంపేశానని అందరికి చెప్పాడు. అయితే మద్యం మత్తులో ఉండటంతో ప్రజలు జగదీశ్ మాటలు నమ్మలేదు. అయితే పలువురు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమిత్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్‌ను అరెస్టు చేశారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Palghar Road Accident | మహారాష్ట్రలో నెత్తురోడిన హైవే.. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
మే 18, 2026

Seaweed Farming | చేపలు లేవని బాధ లేదు.. సముద్రంలోనే కొత్త వ్యవసాయం: మత్స్యకారుల తలరాత మారుస్తున్న ‘సీవీడ్’ సాగు!
మే 16, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



