త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్స్ట్ మూవీ క‌న్ఫామ్ – ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్‌

ఓజీ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఏద‌నే స‌స్పెన్స్‌కు తెర‌ప‌డింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రాబోతుంది. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గురువారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

N

Entertainment | Published On Jan 1, 2026, 12.12 pm IST

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ నెక్స్ట్ మూవీ క‌న్ఫామ్ – ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్‌
Advertisement

Pawan Kalyan | ఓ హిట్టు కొట్టిన వెంట‌నే... త‌మ నెక్స్ట్ మూవీని స‌క్సెసుల్లో ఉన్న డైరెక్ట‌ర్‌తోనే చేయాల‌ని కోరుకుంటారు హీరోలు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రూటే స‌ఫ‌రేటు. ఓజీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌ర్వాత ఫ్లాపుల్లో ఉన్న డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చారు. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో త‌న నెక్స్ట్ సినిమాను చేయ‌బోతున్నాడు.

డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్‌...

న్యూ ఇయ‌ర్‌ను పుర‌స్క‌రించుకొని గురువారం రోజు ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీకి వ‌క్కంతం వంశీ క‌థ‌ను అందించ‌బోతున్నారు. జైత్ర‌రామ మూవీస్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అంటూ రామ్ తాళ్లూరి ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి, రైట‌ర్ వ‌క్కంతం వంశీ దిగిన ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారు.

ఆగిపోయింద‌నుకున్న సినిమా...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాలా రోజుల క్రితం రామ్ తాళ్లూరి ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దాంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమా ఆగిపోయిన‌ట్లు వార్త‌లొచ్చాయి. న్యూ ఇయ‌ర్ రోజున ఈ పుకార్ల‌కు పుల్‌స్టాప్ పెట్టారు మేక‌ర్స్‌.

ఆర్మీఈ ఆఫీస‌ర్‌గా...

స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సురేంద‌ర్ రెడ్డి మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం క‌లిసి రెడీ చేశార‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఎలా చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారో ఆ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా స్క్రిప్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు తెలిసింది.
సురేంద‌ర్ రెడ్డి సినిమాలో ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో కూడా ఆర్మీ గెట‌ప్‌లోనే ప‌వ‌న్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం హీరోయిన్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల ఎంపిక‌కు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌ట‌.
కాగా గ‌త ఏడాది ఓజీతో పెద్ద హిట్ అందుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఓజీకి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఓజీకి సీక్వెల్‌ను అనౌన్స్‌చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement