leech | వ్యక్తి గొంతులో ఇరుక్కుపోయిన బతికున్న జలగ.. వైద్యులు ఎలా బయటకు తీశారంటే..?
leech | జలగ (leech).. దీన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇది మనిషి రక్తాన్ని పీలుస్తుంది. అలాంటిది ఈ ప్రమాదకరమైన జలగ మనిషి గొంతులోకి ప్రవేశిస్తే.. తలచుకుంటేనే ఒంట్లో వణకుపుడుతోంది కదూ.
leech | జలగ (leech).. దీన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇది మనిషి రక్తాన్ని పీలుస్తుంది. అలాంటిది ఈ ప్రమాదకరమైన జలగ మనిషి గొంతులోకి ప్రవేశిస్తే.. తలచుకుంటేనే ఒంట్లో వణకుపుడుతోంది కదూ. అయితే, ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది మరి. 55 ఏళ్ల వ్యక్తి గొంతులో ఓ బతికున్న జలగ ఇరుక్కుపోయింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లాలో చోటు చేసుకుంది.
సిర్మౌర్ (Sirmaur) జిల్లా పచ్చాడ్ నియోజకవర్గంలోని కంగేర్ ధర్యార్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ కుమార్ (Suresh Kumar).. పనిప్రదేశంలో దొరికే నీటిని తాగాడు. అయితే, ఆ నీటిలో జలగ ఉండటాన్ని అతడు గమనించలేదు. దీంతో నీటితోపాటూ అది కూడా గొంతులోకి వెళ్లి అక్కడ ఇరుక్కుపోయింది. ఈ విషయం అతడికి కూడా తెలియదు. గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కాసేపటికి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అతడు సోలన్ (Solan)లోని ఎంఎంయూ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడి గొంతులో ఏదో కదులుతున్నట్లు గుర్తించారు. సిమ్లా (Shimla)లోని ఇందిరా గాంధీ వైద్య కళాశాలకు వెళ్లాలని సూచించారు.
అక్కడ డాక్టర్ డింపుల్ బృందం సురేశ్ గొంతును పరీక్షించింది. బ్రాంకోస్కోపీ నిర్వహించగా.. అతడి గొంతులో బతికున్న జలగ ఉన్నట్లు తేలింది. దీంతో దాన్ని తొలగించేందుకు వైద్య బృందం తీవ్రంగా కష్టపడింది. దాన్ని డైరెక్ట్‌గా తొలగించడం అసాధ్యం. ఏ చిన్న తేడా వచ్చిన అది శరీరంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీంతో వైద్య బృందం వినూత్న పద్ధతిని అనుసరించింది. వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఆ జలగను సజీవంగా బయటకు తీసింది. అనంతరం కొన్ని పరీక్షల తర్వాత రోగిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






