అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం మార్పు పక్కా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
కర్ణాటకలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 8 నుంచి ప్రారంభం అయ్యాయి. బెళగావిలో ఉన్న విధాన సౌధలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 19 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
కర్ణాటకలో ముఖ్యమంత్రి లొల్లి ఇప్పట్లో తగ్గేలా లేదు. నువ్వా, నేనా అన్నట్టుగా సీఎం పీఠం కోసం కాంగ్రెస్ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్ల అవ్వడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తప్పించి వేరే వాళ్లను ఆ సీటులో కూర్చోబెట్టాలని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. సిద్ధరామయ్య తర్వాత ఆ సీటులో కూర్చునే అర్హత డీకే శివకుమార్‌కు మాత్రమే ఉందని పలువురు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే డీకేకి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. అయినా కూడా డీకే శివకుమార్‌ని ముఖ్యమంత్రిని చేయాలని, చాలామంది ఎమ్మెల్యేలు ఆయన పక్షానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పని చేసి పార్టీని గెలిపించిన డీకే శివకుమార్, సిద్ధరామయ్య.. ఇద్దరికీ ఇప్పుడు పడటం లేదని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ హైకమాండ్ డీకేను సీఎంను చేయబోతుందనే ఊహాగానాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది రాసిపెట్టుకోండి అని డైరెక్ట్‌గా మీడియా ముందు చెప్పేశారు. దీంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి.
డీకేతో 55 మంది ఎమ్మెల్యేల డిన్నర్
రామనగర నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే డీకేతో కలిసి డిన్నర్‌లో పాల్గొన్నానని, మొత్తం 55 మంది ఎమ్మెల్యేలం ఈ డిన్నర్‌కి వెళ్లామని స్పష్టం చేశాడు.
శివకుమార్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఖచ్చితంగా ఉందన్నారు. హైకమాండ్ ఏం చెబితే మేం అది చేస్తాం. సీఎంగా ఎవ్వరు వచ్చినా మాకు సమస్య లేదు.. అని వెల్లడించాడు.
కర్ణాటకలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 8 నుంచి ప్రారంభం అయ్యాయి. బెళగావిలో ఉన్న విధాన సౌధలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 19 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




